వీరరాఘవుడు సీమ శాంపిల్ సూపినాడబ్బా!

Update: 2018-08-13 08:21 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీర రాఘవ'  దసరా సీజన్లో రిలీజ్ కు సిద్ధమవుతుందని తెలుసు కదా. ఈ సినిమా టీజర్ ను ఆగష్టు 15 న రిలీజ్ చేస్తారని ఇప్పటికే హారికా హాసినీ వారు డేట్ ను కన్ఫాం చేయడం జరిగింది. తాజాగా వారు టైం కూడా చెప్తూ ఒక  పవర్ఫుల్ ఎన్టీఆర్ పోస్టర్ తో ముందుకొచ్చారు.

ఆగస్ట్ 15 ఉదయం 9 గంటలకు టీజర్ రిలీజ్ అవుతుంది. దీంతో పాటు సీమకుర్రాడు వీరఘవడు యాక్షన్ మోడ్ లో ఉన్న ఓ చిన్న శాంపిల్ పోస్టర్ తో టైమ్ రివీల్ చేయడం విశేషం.  పోస్టర్ లోని లొకేషన్ ఒక స్కూల్ బిల్డింగ్ లోని స్టోర్ రూమ్ లా ఉంది. విరిగిపోయిన కుర్చీలు బల్లలు అటు ఇటు గుట్టలు గా ఉన్నాయి. ఆ లొకేషన్ లో మన వీరరాఘవుడు ఒక విలన్ గ్యాంగ్ రౌడీ ని ఫుల్లు గా కుమ్మి వాడిపై ఒక కుర్చి వేసుకొని దానిపై కాలుమీద కాలేసుకొని ఠీవిగా కూర్చున్నాడు. కుడి చెయ్యి గడ్డం కింద పెట్టుకొని ఎడమ చెయ్యి స్టైల్ గా కాలు మీద అలా పెట్టుకొని 'నేను రెడీ..ఎవరొస్తారో రండి' అన్నట్టుగా సైలెంట్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు.  పోస్టర్ డిం లైట్ లో షాడో లా ఉండడంతో సూపర్ ఎఫెక్ట్ వచ్చింది.

ఇప్పటికే ఈ పోస్టర్ సోషల్ మీడియా లో దుమ్ము రేపుతోంది.  తారకరాముడి మాస్ అవతారాన్ని గురూజి ఫుల్ గా బయటకు తీసినట్టు ఈ శాంపిల్ తో చెప్పకనే చెప్పాడు.  ఇక ఎల్లుండి టీజర్ రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో!
Tags:    

Similar News