టెంపర్ మూవీలో ఎన్టీఆర్ చెప్పిన దండయాత్ర డైలాగ్ సూపర్బ్ గా పేలింది. 'ఇది దయాగాడి దండయాత్ర' అంటూ డైలాగ్ చెప్పడం సంగతేమో కానీ.. అక్కడి నుంచి ఎన్టీఆర్ సినిమాల దూకుడు ఆ స్థాయిలోనే ఉంంది. ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ లు సాధిస్తూ.. ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేస్తున్నాడు. ఇప్పుడు తన దండయాత్రలో లేటెస్ట్ వెర్షన్ స్టార్ట్ చేశాడు యంగ్ టైగర్.
బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ కొత్త సినిమా చేస్తున్నాడు. గత నెలలోనే షూటింగ్ ప్రారంభం కాగా.. ఇప్పుడు జూనియర్ కూడా సెట్స్ లోకి వచ్చేశాడు. మార్చ్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి అటెండ్ అయిపోతున్నాడు యంగ్ టైగర్. షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫోటోను ఇచ్చారు కానీ.. ఎన్టీఆర్ ను వెనక నుంచి చూపించి.. అభిమానులను ఊరిస్తున్నాడు దర్శకుడు. జై లవ కుశ అనే వర్కింగ్ టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తుండగా.. వీటిలో ఒక రోల్ నెగిటివ్ షేడ్స్ తో నిండి ఉంటుందని తెలుస్తోంది.
రాశి ఖన్నా.. నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఓస్టార్ హీరోయిన్ తో స్పెషల్ రోల్ చేయించబోతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పటికే అన్ని పాటలను కంపోజ్ చేసి ఇచ్చేసేయడం విశేషం. త్వరత్వరగా షూటింగ్ చేసేసి.. ఆగస్ట్-సెప్టెంబర్ లలో ఈ మూవీని రిలీజ్ చేసేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/