నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కబోయే ‘యన్.టి.ఆర్’ కోసం తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు తేజ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో మధ్యలో దీనిపై రకరకాల సందేహాలు నెలకొన్నాయి కానీ.. క్రిష్ తేజ స్థానంలోకి రావడంతో నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయింది. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. బాలయ్యతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి మైల్ స్టోన్ మూవీ చేసిన క్రిష్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అతను కచ్చితంగా ఈ చిత్రాన్ని గొప్పగా మలుస్తాడని ఆశిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈలోపే ‘యన్.టి.ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటించేసింది చిత్ర బృందం. ఇందుకోసం ఒక చారిత్రక తేదీని ఎంచుకున్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతూ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్.. తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే ‘యన్.టి.ఆర్’ విడుదల కాబోతుండటం విశేషం. ఆ తేదీ.. జనవరి 9. తనకు సెంటిమెంటు అయిన సంక్రాంతి సీజన్ కూడా కలిసొస్తుండటంతో ఆ తేదీకే బాలయ్య ఫిక్సయినట్ుల సమాచారం. ఐతే ఈ డేట్ అందుకోవడానికి చిత్ర బృందం బాగానే కష్టపడాల్సి ఉంటుంది. ఈ చిత్ర షూటింగ్ మొదలవడానికి ఇంకో నెల రోజులు పడుతుందని అంటున్నారు. అంటే ఐదు నెలల్లో సినిమాను పూర్తి చేసి చకచకా పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఐతే ‘శాతకర్ణి’ లాంటి భారీ సినిమానే 80 రోజుల్లోపు పూర్తి చేసిన క్రిష్.. ఈ సినిమాను ఐదు నెలల్లో తీయలేడా అంటున్నారు.