బుచ్చిబాబుతో స్నేహం అంత ప‌ని చేసింది!

Update: 2022-02-04 06:30 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్నేహానికి ఎంత‌గా విలువ‌నిస్తారో చూస్తున్న‌దే. త‌న్ క్లోజ్ ఫ్రెండ్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి ఆర్.ఆర్.ఆర్ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాలో న‌టించాడు. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. ఇంత‌లోనే త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన ద‌ర్శ‌క‌ర‌చ‌యిత కొర‌టాల శివతో సినిమాని ప్రారంభించేస్తున్నాడు.

ఈ మూవీ త‌ర్వాత కూడా స్నేహం కోసం సినిమా చేస్తున్నాడంటే అర్థం చేసుకోవాలి. తార‌క్ త‌న‌ స్నేహితుడు బుచ్చిబాబు కోసం ఒక గొప్ప త్యాగం చేయ‌బోతున్నాడ‌ని తెలిసింది. నిజానికి మైత్రి మూవీస్ కి ఎన్టీఆర్ ఇచ్చిన క‌మిట్ మెంట్ ప్ర‌కారం... ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రితో సినిమానే చేయాలి. కానీ అత‌డు ఇప్పుడు నిర్ణ‌యం మార్చుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌శాంత్ నీల్ కి తార‌క్ కి మ‌ధ్య ఇప్పుడు బుచ్చి బాబు ఉన్నాడు. అత‌డితో తార‌క్ కి ఉన్న అనుబంధం దృష్ట్యా వెంట‌నే సినిమా చేయాల్సి ఉంటుంది. పైగా తార‌క్ కోసం బుచ్చిబాబు ఉప్పెన లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి కూడా ఇంత‌కాలం వెయిట్ చేశాడు. ఎన్టీఆర్ కోసం అత‌డు స్క్రిప్టు రెడీగా ప‌ట్టుకుని ఉన్నాడు. ఇక తార‌క్ రావ‌డ‌మే ఆల‌స్యం సినిమాని సెట్స్ కి తీసుకెళ్ల‌డ‌మే. కార‌ణం ఏదైనా.. బుచ్చిబాబుతో మూవీ కోసం తార‌క్ ప్ర‌శాంత్ నీల్ ని కూడా ప‌క్క‌న పెట్టాడంటే అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక‌పోతే ప్ర‌శాంత్ నీల్ స‌న్నివేశం కూడా పూర్తి హెక్టిక్ గా ఉంది. అనూహ్యంగా ప్ర‌భాస్ తో స‌లార్ ని రెండు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నందున అత‌డు మ‌రో ఏడాది పైగానే తీవ్రంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. అప్ప‌టికి బుచ్చిబాబుతో సినిమాని తార‌క్ పూర్తి చేసి రెడీ అవ్వాల్సి ఉంటుంది. ప్ర‌శాంత్ నీల్ కోసం బ‌న్ని.. మ‌హేష్‌.. చ‌ర‌ణ్ లాంటి స్టార్లు ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఆ క్ర‌మంలోనే తార‌క్ తో వెంట‌నే ప‌న‌వుతుందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.

కొర‌టాల శివ‌తో ఎన్టీఆర్ 30 త‌ర్వాత క‌న్ఫామ్ గా ప్ర‌శాంత్ నీల్ తోనే చేయాల‌నుకున్నా ఇప్పుడు బుచ్చిబాబుతో స్నేహం కోసం అత‌డు దానిని త్యాగం చేస్తున్నాడు. త‌న‌లోని త‌హ‌త‌హ‌ని ఆపి ఉంచాడు! 2022 ముగింపులో బుచ్చిబాబుతో సినిమాని తార‌క్ ప్రారంభిస్తారు. ఆ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తాడు. అంత‌వ‌ర‌కూ తార‌క్ త‌న‌లోని త‌హ‌త‌హ‌ను క్యూరియాసిటీని ఆపి ఉంచుతాడ‌న్న‌మాట‌.
Tags:    

Similar News