అద్దంలో చూసుకుని భయపడిపోయా-ఎన్టీఆర్

Update: 2016-01-10 11:30 GMT
‘నాన్నకు ప్రేమతో’లో ఎన్టీఆర్ గెటప్ గత ఆర్నెల్ల నుంచి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇది ఒక రకంగా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండు క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. స్టైల్ విషయంలో ఇంతకుముందు ఎన్టీఆర్ బాగా వెనకబడి ఉండే వాడు కానీ.. ఈ గెటప్ తో యూత్ కి బాగా దగ్గరైపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది కుర్రాళ్లిప్పుడు ఆ గెటప్ ఫాలో అవుతున్నారు. ఐతే మొదట్లో ఎన్టీఆర్ గెటప్ జనాలు అదోలా ఫీలైన మాట వాస్తవం. నిజానికి ఎన్టీఆర్ కు కూడా మొదట్లో ఈ గెటప్ అదోలాగే అనిపించిందట. భయం పుట్టించిందట. ఎన్నో సందేహాల మధ్య ఈ స్టైల్ ట్రై చేసి.. చివరికి షూటింగ్ కు వెళ్లాక కానీ జీర్ణించుకోలేకపోయానని చెప్పాడు ఎన్టీఆర్.

‘‘గెటప్ - లుక్ విషయంలో ఏదైనా డిఫరెంటుగా చేద్దామన్నారు సుకుమార్. ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి స్టైల్ నడుస్తోందా అని ఆలోచించి.. అండర్ కట్స్ విత్ బియర్డ్ స్టయిల్ ట్రై చేద్దాం అనుకున్నాం. అలా అనేక కట్స్ తర్వాత ఓ లుక్ అనుకున్నాం. ఐతే దాన్ని ట్రై చేయడం మొదలుపెట్టాక చాలా రాడికల్ గా అనిపించింది. చాలా భయం కూడా కలిగింది. ఇదేంటి.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కంగారు పడిపోయాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నపుడు కూడా భయం కలిగింది. కానీ సుకుమార్ గారి మీద నమ్మకంతో ముందుకెళ్లిపోయాను. ఐతే నా భర్య లక్ష్మీప్రణతికి నా లుక్ నచ్చింది. అమ్మకు మాత్రం ఏమీ అర్థం కాలేదు. నా కొడుకు మాత్రం ఈ లుక్ కి బాగా అలవాటు పడిపోయాడు. ఇక షూటింగ్ మొదలెట్టక ముందు వరకు లుక్ విషయంలో కంగారుగానే ఉన్నా కానీ.. ఒక్కసారి ఆ సూట్ వేసుకుని సెట్లోకి వెళ్లంగానే భయంకరమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది’’ అని ఎన్టీఆర్ చెప్పాడు. తన కొడుక్కి ఊహ తెలిసినపుడు తాను ఈ కొత్త లుక్ లోనే ఉన్నానని.. మళ్లీ లుక్ మార్చాల్సి వచ్చినపుడు.. వాడు గుర్తుపడతాడో లేదో అని భయపడ్డానని, కానీ వాడు వెంటనే నానా అంటూ దగ్గరికి వచ్చేశాడని ఎన్టీఆర్ వెల్లడించాడు.
Tags:    

Similar News