#EMK నిర్వాహకులపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్‌

Update: 2021-09-08 11:30 GMT
జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఆశించిన రేంజ్ లో స్పందన రాలేదు అనే వాదన వినిపిస్తుంది. జనాలు బిగ్ బాస్ ను పట్టించుకున్నంతగా ఎన్టీఆర్ గేమ్‌ షో ను పట్టించుకోవడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎవరు మీలో కోటీశ్వరులు షో విషయంలో నెటిజన్స్ ట్రోల్స్ తో పాటు ఎన్టీఆర్‌ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. షో లో అడుగుతున్న ప్రశ్నల విషయంలో పరువు పోతుంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు వేల రూపాయల ప్రశ్నలు సింపుల్ గా ఉండాలి అనే ఉద్దేశ్యంతో మరీ దారుణమైన ప్రశ్నలను అడుగుతున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రశ్నలు మరీ సిల్లీగా ఉంటున్నాయి అంటూ కామెంట్స్ వస్తుంటే మరి కొన్ని ప్రశ్నల విషయంలో ట్రోల్స్‌ వస్తున్నాయి.

షో నిర్వాహకులు ప్రశ్నల విషయంలో మరీ ఇంత అశ్రద్ద చూపిస్తే ఎలా అంటూ ఎన్టీఆర్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా కొందరు అభిమానులు మాత్రం షో కు ఎన్టీఆర్‌ పూర్తి న్యాయం చేస్తున్నాడు. కాని నిర్వాహకులు మాత్రం ఎన్టీఆర్‌ స్టార్ డమ్‌ ను వినియోగించుకోలేక పోతున్నారు. పోగ్రాం ప్రొడ్యూసర్ లు మరీ దారుణంగా ఎన్టీఆర్‌ తో ఆట ఆడిస్తున్నారు. ఎన్టీఆర్‌ తో షో ను నడిపించే విషయంలో వారు పూర్తిగా విఫలం అవుతున్నారు అంటూ అభిమానులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం షో విషయంలో పూర్తి సంతృప్తితో తాము ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్‌ ఆర్ షూటింగ్ ముగియడంతో తదుపరి సినిమా చిత్రీకరణ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది. రెగ్యులర్ షూటింగ్‌ ను అక్టోబర్ లేదా నవంబర్‌ లో అంటున్నారు. సినిమా ను వచ్చే సమ్మర్ లోనే విడుదల చేస్తారని కూడా సమాచారం అందుతోంది. ఇక ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను ఎన్టీఆర్‌ చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ పలువురు దర్శకులను క్యూ లైన్ లో ఉంచాడు. కనుక ముందు ముందు ఆయన నుండి భారీ పాన్ ఇండియా సినిమాలు రావడం ఖాయం అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



Tags:    

Similar News