నంద‌మూరి ఫ్యాన్స్ కు పండ‌గేః బాల‌య్య సినిమాకోసం ఎన్టీఆర్‌?

Update: 2021-03-28 14:30 GMT
బాలకృష్ణ-బోయపాటి  కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న చిత్రం బీబీ-3. వీరిద్దరి కాంబోలో వ‌చ్చిన రెండు చిత్రాలు సింహా, లెజెండ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో ఈ చిత్రంపై అభిమానులో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే.. ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసిన‌ప్ప‌టికీ.. టైటిల్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయ‌లేదు.

ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా టైటిల్ ను మహా శివరాత్రి సందర్భంగా ప్ర‌క‌టిస్తార‌నే ప్ర‌చారం సాగింది. కానీ.. శివరాత్రి దాటిపోయి చాలా రోజులు అయినప్పటికీ.. ఇంకా టైటిల్ మాత్రం ప్రకటించలేదు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఉగాదికి ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

దీంతోపాటు.. ఇంకో బిగ్ అప్డేట్ కూడా ఉంది. ఈ టైటిట‌ల్ ను యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. టైటిల్ తోపాటు ఫ‌స్ట్ లుక్ ను తార‌క్ తో విడుద‌ల చేయించాల‌ని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ట్రై చేస్తున్నార‌ట‌.

జూనియర్ ద్వారా సోషల్ మీడియాలో ఈ టైటిల్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త ఖ‌చ్చితంగా నంద‌మూరి అభిమానులు పండ‌గ చేసుకునేదే. అయితే.. జూనియ‌ర్ వ‌స్తారా? రారా అన్నది తేలాల్సి ఉంది.

ద్వారకా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. థమన్ సంగీతం అందిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో స్లాట్ బుక్ చేసిన ఈ చిత్రాన్ని మే 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.
Tags:    

Similar News