జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ‘జనతా గ్యారేజ్’. విడుదలైన దగ్గర నుంచీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు నమోదు చేస్తోంది. ఇప్పటివరకూ జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల గ్రాస్ - రూ. 80 కోట్ల షేర్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, తారక్ కెరీర్లోనే టాప్ గ్రాసింగ్ చిత్రంగా అవతరిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మూడో స్థానంలో జనతా ఉంది. ఇండియాలో కూడా ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో కలెక్షన్లపరంగా మోత మోగించిన టాప్ సినిమాల్లో జనతా గ్యారేజ్ మూడో స్థానం దక్కించుకుంది. సో... తనకు ఇంత అద్భుతమైన చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు కొరటాల శివకు ఒక అద్భుతమైన బహుమానం ఇవ్వాలనే ఆలోచనలో తారక్ ఉన్నారని సమాచారం!
గతంలో కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ఈ సందర్భంగా మహేష్ బాబు ఒక ఆడీ కారును కొరటాలకు బహుమానంగా ఇచ్చారు! సో... కొరటాలకు కారు ఉంది కాబట్టి, అంతకుమించిన బహుమానం ఏదైనా ఇవ్వాలని తారక్ అనుకుంటున్నాడట! అయితే, ప్రస్తుతం కొరటాలకు హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదట. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అందుకే, కొరటాలకి ఒక డూప్లెక్స్ విల్లాను తారక్ బహుమానంగా ఇవ్వబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా తారక్ చెయ్యలేదు. తారక్ ఇవ్వబోతున్న బహుమానం ఇల్లో ఇంకేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇంత భారీ హిట్ ఇచ్చిన దర్శకుడికి తన రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా తారక్ బహుమతి ఉండొచ్చని అభిమానులు అంటున్నారు.