యంగ్ టైర్ ఎన్టీఆర్ ఇటీవల విడుదలైన అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు మరియు హీరోలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ విషెష్ చూస్తుంటే ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖచ్చితంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తోనే అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందని కూడా సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చాలా కాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలన్నీ కూడా చినబాబు నిర్మిస్తున్నాడు. హాసిని అండ్ హారిక బ్యానర్ ను ప్రారంభించిన ఆయన ఆ బ్యానర్ లో కేవలం త్రివిక్రమ్ తో మాత్రమే సినిమాలు నిర్మిస్తున్నాడు. వరుసగా త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తూ లాభాలు దక్కించుకుంటున్న ఆయనకు స్టార్ హీరోలు గండి కొడుతున్నారు. ఇటీవల అల వైకుంఠపురంలో సినిమాకు హీరో సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామి అయ్యింది. అల్లు అరవింద్ బలవంతంగా ఈ నిర్మాణంలో జాయిన్ అయ్యాడు అంటూ ఆమద్య వార్తలు వచ్చాయి. తప్పని పరిస్థితుల్లో ఆయన్ను నిర్మాణ భాగస్వామిగా చేర్చుకున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ దాదాపుగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయబోతున్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇదే సమయంలో చినబాబు తో పాటు చిత్ర నిర్మాణంలో తన అన్న కళ్యాణ్ రామ్ ను భాగస్వామిగా మార్చాలని ఎన్టీఆర్ కోరినట్లుగా సమాచారం అందుతోంది. నిర్మాణం మొత్తం చినబాబు చూసుకోనుండగా లాభాల్లో షేర్ ను చినబాబు మరియు కళ్యాణ్ రామ్ తీసుకునేలా ఒప్పందం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన అన్న బ్యానర్ లో జై లవకుశ చిత్రాన్ని చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం వల్ల తన అన్న పై ఎన్టీఆర్ ఇలా అభిమానం చూపుతున్నాడు అంటూ నందమూరి అభిమానులు అనుకుంటున్నారు.