మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా ప్రత్యేకం. నెలాఖర్లో సీనియర్ ఎన్టీఆర్ జయంతి వస్తుంది. దానికంటే వారం ముందు మే 20న జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం. వారం వ్యవధిలో వారికి రెండు పండగలు. తాత పోలికలతో పుట్టిన జూనియర్.. ఆయన పుట్టిన రోజుకు చాలా సమీపంలోనే పుట్టడం యాదృచ్ఛికమే. ఐతే పుట్టిన రోజు వేడుకల్ని డాబుగా చేసుకోవడం ఎన్టీఆర్ కు అలవాటు లేదు. అప్పుడప్పుడూ మాత్రమే ఇండస్ట్రీలోని తన సన్నిహితులతో కలిసి బర్త్ డే పార్టీ చేసుకుంటూ ఉంటాడు ఎన్టీఆర్. ఐతే ఈసారి అసలు ఎన్టీఆర్ తన పుట్టిన రోజుకు హైదరాబాద్ లోనే ఉండట్లేదట.
తన తల్లి షాలిని.. భార్య లక్ష్మీప్రణతి.. కొడుకు అభయ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ తన పుట్టిన రోజుకు వేరే ప్రాంతంలో ప్రశాంతంగా గడపబోతున్నట్లు సమాచారం. ముందు రోజు సాయంత్రం ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాక ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్తాడట. రెండు రోజులు అక్కడే గడిపి తిరిగి హైదరాబాద్ వచ్చి.. ‘జనతా గ్యారేజ్’ షూటింగులో పాల్గొంటాడని సమాచారం. కాబట్టి ఇండస్ట్రీ జనాలెవ్వరికీ పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్ దొరికే ఛాన్స్ లేదు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరో పుట్టిన రోజుకు భారీ లెవెల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ రోజు వాళ్లందరికీ ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రూపంలో ఓ కానుక ఇచ్చి వెళ్తున్నాడు ఎన్టీఆర్.