రంగ‌స్థ‌లం చిట్టిబాబులా.. పుష్పరాజ్ లా మాసీగా..

Update: 2022-03-13 08:51 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సెల‌క్ష‌న్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం అత‌డు న‌టించిన ఆర్.ఆర్.ఆర్ విడుద‌ల‌వుతోంది. తదుప‌రి కొర‌టాల‌తో భారీ యాక్ష‌న్ చిత్రంలో న‌టించ‌నున్నాడు. ఇందులో తార‌క్ రాజ‌కీయ నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడ‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ఈ మూవీ త‌ర్వాత బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో నటించాల్సి ఉండ‌గా దానిని ఇంకా అధికారికంగా ప్రారంభించ‌లేదు.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎన్టీఆర్  మూవీ గురించి అప్ డేట్ కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న భారీ ఎత్తున లాంచ్ చేయ‌నున్నారని తెలిసింది. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ని తెలిసింది.
ఇందులో త‌న పాత్ర కోసం తారక్ చాలా ఛేంజెస్ చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఎన్టీఆర్ తన కెరీర్ లోనే తొలిసారిగా ప‌క్కా మాస్ పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడని గుస‌గుస వినిపిస్తోంది.

మ‌రో ర‌కంగా చూస్తే.. ఎన్టీఆర్ కూడా రంగ‌స్థ‌లంలో రామ్ చ‌ర‌ణ్ లా ..  పుష్ప‌లో బ‌న్నిలా క‌నిపిస్తాడ‌న్న గుస‌గుస కూడా వేడెక్కించేస్తోంది. ఈ చిత్రానికి కాల్షీట్ల‌ను ఇచ్చేశాడ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కంటే ముందే కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుంద‌ట‌.

కొరటాల శివ తదుపరి చిత్రాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండిటినీ పూర్తి చేయ‌కుండా ఏదైనా ప్ర‌కటిస్తే చాలా ముందస్తు అవుతుంద‌న్న గుసగుస కూడా వినిపిస్తోంది.

అయితే ఉప్పెన ద‌ర్శ‌కుడితో తార‌క్ వేగంగా సినిమా పూర్తి చేయాల‌ని అత‌డిని వైవిధ్యంగా చూడాల‌ని అభిమానులు ఆరాట‌ప‌డుతున్నారు. ఉప్పెన దర్శకుడికి చాలా సమయం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ను గ్రామీణ యువ‌కుడి గెట‌ప్ లో చూడాలని అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

కానీ అది వెంట‌నే సాధ్య‌ప‌డే ప‌ని కాద‌ని కూడా క్లారిటీ వుంది. ఈనెల 25న వ‌స్తున్న ఆర్.ఆర్.ఆర్ లో గిరిజ‌న యువ‌కుడిగా .. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా.. ముస్లిమ్ యువ‌కుడిగా గెట‌ప్ లో కూడా తార‌క్ క‌నిపిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.
Tags:    

Similar News