జై లవ కుశ.. వాళ్లను అరెస్ట్ చేసేశారు

Update: 2017-06-28 04:39 GMT
జనతా గ్యారేజ్ మూవీతో ఫుల్ స్వింగ్ లోకి వచ్చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ టైటిల్ పై సినిమాను ఫుల్ స్పీడ్ లో ఫినిష్ చేసేస్తుండడమే కాదు.. రీసెంట్ గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. సెప్టెంబర్ 21న జై లవ కుశ థియేటర్లలోకి వస్తోందని చెప్పేశాడు యంగ్ టైగర్.

అయితే.. జై లవ కుశ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కొంత కంటెంట్ బయటకు లీక్ అయింది. ఇంకా షూటింగ్ కూడా ఫినిష్ కాకపోవడంతో.. ఇవి రఫ్ కట్స్ మాత్రమే అని చెబుతున్నారు. అయితే.. ఈ లీకుల ఘటనను మాత్రం ఎన్టీఆర్ మూవీ యూనిట్ చాలా సీరియస్ గా తీసుకుంది. సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ఓ స్వీట్ న్యూస్ చెప్పాడు. జై లవ కుశ మూవీ లీకులకు కారణం అయిన వ్యక్తులను గుర్తించడం జరిగిందని.. అలాగే వారిని అరెస్ట్ కూడా చేశారని అధికారికంగా ప్రకటించాడు కళ్యాణ్ రామ్.

ఆ తర్వాత పాయింటే.. కళ్యాణ్ రామ్ ట్వీట్ పై మరింత ఆసక్తి కలిగేలా చేసింది. మరిన్ని వివరాలు రేపు చెబుతానంటూ జై లవ కుశ ప్రొడ్యూసర్ చెప్పడంతో.. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. ఎవరు లీక్ చేసుకుంటారు.. ఎందుకు చేసి ఉంటారు.. ఎందుకు వారి వివరాలను బైటకు చెబ్తానని కళ్యాణ్ రామ్ అన్నాడు అనే అంశాలపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News