రేంజ్ పరంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కన్నా.. పవన్ కళ్యాణ్ ఎక్కువే. ఐతే గతంలో వీళ్లిద్దరి మధ్య అంతరం చాలా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో వరుస హిట్లతో తన మార్కెట్ బాగా పెంచుకున్నాడు ఎన్టీఆర్. అతడి చివరి సినిమా ‘జనతా గ్యారేజ్’ నాన్-బాహుబలి సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఆ ప్రభావం అతడి కొత్త సినిమా ‘జై లవకుశ’పై పడింది. ఈ సినిమా బిజినెస్ అనూహ్యమైన స్థాయికి చేరుకుంది. ఏకంగా రూ.110 కోట్లకు పైగా ఈ చిత్రానికి బిజినెస్ జరగడం విశేషం. కొన్ని ఏరియాల్లో పవన్ సినిమాలకు దీటుగా బిజినెస్ చేసింది ఈ చిత్రం. హిందీ డబ్బింగ్ హక్కుల విషయంలో పవన్-త్రివిక్రమ్ సినిమాకు ఎంత రేటు పలికిందో.. ‘జై లవకుశ’కూ అదే స్థాయిలో ధర రావడం విశేషం.
కొన్నాళ్ల కిందట పవన్ సినిమా హిందీ అనువాద హక్కుల్ని ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే ఛానెల్ ఎన్టీఆర్ చిత్రాన్ని అంతే రేటుకు కొన్నట్లు తెలిసింది. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్లకు ఉత్తరాదిన సూపర్ క్రేజ్ ఉంటోంది. హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్ లో పెట్టినా.. టీవీలో ప్రసారం చేసినా రెస్పాన్స్ అదిరిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడొస్తున్న పెద్ద సినిమాలకు ఈ బిజినెస్ అదనంగా యాడ్ అవుతోంది. ఐతే తెలుగు శాటిలైట్ హక్కుల విషయంలో మాత్రం ‘జై లవకుశ’పై పవన్ మూవీ చాలా మార్జిన్ తో పైచేయి సాధించింది. ఎన్టీఆర్ సినిమాకు శాటిలైట్ రైట్స్ రూ.14.5 కోట్లు పలకగా.. పవన్ మూవీని రూ.21 కోట్లకు కొన్నారు.