యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన 'జైలవకుశ' చిత్రం మంచి సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. కమర్షియల్ గా రికార్డులు బద్దలు కొట్టకున్నా ఈ చిత్రం ఖాతాలో అరుదైన రికార్డు ఒకటి చేరింది. దక్షిణ కొరియాలో జరిగే ప్రతిష్టాత్మక బుచాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే విభిన్నమైన చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడం జరుగుతుంది.
అక్కడ ప్రదర్శింపబడిన తొలి తెలుగు సినిమా 'జై లవకుశ'. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఏ తెలుగు సినిమాకు ఆ అవకాశం అయితే దక్కలేదు. తాజాగా ఈ ఏడాది కూడా పలు సినిమాలను పరిశీలించిన వారు సౌత్ ఇండియా నుండి ఏ ఒక్క సినిమాకు ఛాన్స్ ఇవ్వలేదు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'గల్లీ బాయ్' కి మాత్రం ఈసారి బుచాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడే అవకాశం దక్కింది.
ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషించడంతో పాటు మూడు పాత్రల్లో కూడా అద్బుతమైన నటన ప్రతిభ కనబర్చిన కారణంగా అప్పట్లో జైలవకుశ చిత్రం బుచాన్ కు ఎంపిక అయ్యింది. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలను ఒకే నటుడు చేసిన కారణంగా బుచాన్ లో ప్రదర్శణకు ఎంపిక అయ్యిందని చెబుతున్నారు. మళ్లీ ఏ తెలుగు సినిమా బుచాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్తుందో.. ఎన్టీఆర్ రికార్డు ను టచ్ చేస్తుందో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది. కాని ప్రతి ఏడాది కూడా నిరాశే మిగులుతుంది.