ఎన్టీఆర్ వాళ్ల పని పట్టేశాడు

Update: 2016-07-10 07:12 GMT
జూనియర్ ఎన్టీఆర్ గత రెండు సినిమాలకు విపరీతమైన టెన్షన్ అనుభవించాడు. షూటింగ్ విషయంలో చాలా హడావుడి నెలకొంది. ‘టెంపర్’ సినిమాను 2014 ద్వితీయార్ధంలో మొదలుపెట్టి.. నాలుగైదు నెలల్లో పూర్తి చేసేయాలని చూశారు. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ పెట్టుకుని రేయింబవళ్లు కష్టపడ్డారు. కానీ కుదర్లేదు. అనుకున్న తేదీకి నెల ఆలస్యంగా సినిమా రిలీజైంది. ఇక ఎన్టీఆర్ తర్వాతి సినిమా ‘నాన్నకు ప్రేమతో’ విషయంలో మళ్లీ టెన్షన్ తప్పలేదు. దీనికి కూడా ఎన్టీఆర్ అండ్ టీం రేయింబవళ్లు కష్టపడింది. ఈ సినిమాకు ఎలాగోలా డెడ్ లైన్ అందుకున్నారు. కానీ టెన్షన్ మామూలుగా లేదు. ప్రమోషన్ కు టైం లేకపోయింది.

ఐతే జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం ముందు నుంచి పక్కా ప్లాన్ తో సాగిపోతున్నాడు కొరటాల శివ. అన్ని షెడ్యూళ్లూ అనుకున్న ప్రకారం పూర్తయ్యాయి. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ మొదలుపెట్టి.. అనుకున్న ప్రకారం పూర్తి చేశాడు కొరటాల. ఎన్టీఆర్ విలన్ల పని పట్టే సన్నివేశాల్ని భారీ స్థాయిలో చిత్రీకరించారట. ఇంతటితో షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లేనట. ఒకటో రెండో పాటలు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఈ నెల 22న ఆడియో విడుదల సమయానికి మొత్తం పని పూర్తయిపోతుందట. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా జరుగుతోంది. ఆడియో విడుదల తర్వాత 20 రోజుల వ్యవధిలో పోస్ట్ ప్రొడక్షన్.. ప్రమోషన్ తాపీగా చేసుకుని ఆగస్టు 12న భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయబోతున్నారు. ఔట్ పుట్ విషయంలో కొరటాల-ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట.
Tags:    

Similar News