జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్లు వచ్చేశాయి. ఆ పోస్టర్లు చూశాక అభిమానుల ఆనందం మామూలుగా లేదు. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలోనే వీటిని తీర్చిదిద్దింది చిత్ర బృందం. సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ఈ లుక్స్ గురించి నెగెటివ్ టాక్ లేదు. సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేశాయి ఈ లుక్స్. ఐతే పోస్టర్ల విషయంలో కేవలం సినిమా కోణాన్నే కాకుండా రాజకీయ కోణాన్ని కూడా చూస్తున్నారు కొంతమంది. వీటి ద్వారా ఎన్టీఆర్ జనాలకు ఏదో కన్వే చేయదలుచుకున్నట్లు కూడా చర్చ నడుస్తోంది.
పోస్టర్లను జాగ్రత్తగా గమనిస్తే.. ఎన్టీఆర్ ను నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నట్లు కూడా అనిపిస్తోంది. ఎన్టీఆర్ లుక్ ఒక లీడర్ తరహాలోనే ఉంది. ఆ చొక్కా.. ఆ కళ్లజోడు.. అన్నీ చూస్తే మొత్తంగా తారక్ కు రాయల్ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందని స్పష్టమవుతోంది. తారకరామముడిని ఒక లీడర్ లా ప్రొజెక్ట్ చేసే లాగే ఈ లుక్స్ ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సంకెళ్లతో ఉన్నప్పటికీ జనాలకు అభివాదం చేయడం కూడా రాజకీయ పరంగా ఒక రకమైన సంకేతమే అన్న చర్చ కూడా నడుస్తోంది.
రాజకీయంగా తాను ఎదగకుండా ఎంతగా తొక్కే ప్రయత్నం జరుగుతున్నా.. జనాకర్షణ తనకే ఉందని.. తాను వెనక్కి తగ్గబోనని ఈ పోస్టర్ ద్వారా కన్వే చేస్తున్నాడేమో అంటున్నారు కొందరు. నారా చంద్రబాబు నాయుడి తర్వాత ఆయన తనయుడు నారా లోకేష్ కే తెలుగు దేశం పార్టీ పగ్గాలు అప్పజెప్పేందుకు ఎంత గట్టి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. జనాకర్షణ.. సామర్థ్యం.. పరంగా ఎవరు ముందుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సంగతి తెలుగుదేశం నేతలకు కూడా తెలియంది కాదు కూడా. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా తన రాజకీయ ఆకాంక్షల గురించి.. భవిష్యత్తు గురించి.. ఏమైనా సంకేతాలు ఇస్తాడేమో అన్న చర్చ కూడా నడుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/