వద్దని చెప్పండి బాలయ్యా

Update: 2019-02-27 06:58 GMT
ఎన్టీఆర్ మహానాయకుడు గురించి కనీసం వినడానికి కూడా ఇష్టపడటం లేదు నందమూరి అభిమానులు. తమ తెరవేల్పు బయోపిక్ ఇంత దారుణంగా దెబ్బ తినడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కథానాయకుడే పెద్ద దెబ్బ అనుకుంటే మహానాయకుడు అంతకు మించి అనేలా ఏకంగా రెండో రోజే నెగటివ్ షేర్స్ రాబట్టుకోవడం పరిస్థితి ఎంతగా దిగజారిందో చూపిస్తోంది. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు ఫ్రీ టికెట్ల వ్యవహారం ఎన్టీఆర్ ఇమేజ్ ని ఇంకా డ్యామేజ్ చేసేలా ఉండటంతో ఫ్యాన్స్ ఇది ఆపండి మొర్రో అంటున్నారు.

చాలా చోట్ల మహానాయకుడు థియేటర్లను ఫీడ్ చేసే బాద్యతను టిడిపి పార్టీ తీసుకోవడంతో ఉచితంగా టికెట్లు ఇస్తున్న ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జిల్లా అద్యక్షులు పంపించినట్టుగా వచ్చిన వాట్స్ అప్ మెసేజులు ఫ్రీషోల గురించి స్థానిక ఎమెల్యేలు చేసిన ఫ్లెక్సీల ప్రచారం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేసాయి. ఇవి చూసిన ట్రాలర్ వీరులు ఊరికే ఉంటారా. రంగంలోకి దిగేసారు

ఇప్పుడు తాజాగా డ్వాక్రా మహిళలకు ఫ్రీషోలు వేయమని ఆదేశాలు వచ్చాయట. ఆ ఖర్చులన్నీ స్థానిక టిడిపి క్యాడర్ భరిస్తుంది. ఎగ్జిబిటర్ కు టికెట్ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి నో చెప్పడానికి లేదు. అయితే ఇలా ఎన్టీఆర్ లాంటి వెండితెర వేల్పు సినిమాను వారం తిరక్కుండానే ఇలా ఫ్రీషోల పేరుతో పరువు తీయడం ఏమిటని ఫ్యాన్స్ వాపోతున్నారు.

ఒకప్పుడు బళ్ళు కట్టుకుని బ్లాక్ లో టికెట్లు కొని కుటుంబ సమేతంగా తన సినిమాలకు జనం వచ్చేలా చేసుకున్న ఎన్టీఆర్ కథను తెరమీద ఇలా ఉచితంగా లాక్కెళ్ళి బలవంతంగా చూపించాల్సిన దుస్థితి ఎంటని వాళ్ళ వెర్షన్. ఇది ఇంకొద్ది రోజులు కొనసాగితే ఫ్రీ టికెట్ల వ్యవహరం కాస్తా జాతీయ మీడియాలో సైతం జోక్ గా మారే ప్రమాదం ఉంది. చూసుకోండి మరి.
    

Tags:    

Similar News