'ఎన్టీఆర్ మహానాయకుడు' శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ ను నమోదు చేయడంతో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయం అందరికీ అర్థం అయింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 1.57 కోట్ల షేర్ సాధించింది. ఇక రెండోరోజుకు కలెక్షన్స్ మరింతగా క్రాష్ అయ్యాయి.
రెండో రోజు తెలుగు రాష్ట్రా ల్లో రూ. 45 లక్షలకు అటూఇటుగా షేర్ వసూలు చేసింది. నైజామ్ ఏరియాలో 18 లక్షలు.. ఉత్తరాంధ్రలో 7 లక్షలు.. గుంటూరులో 5 లక్షలు.. నెల్లూరు లో 2 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. రెండు రోజులకు గానూ తెలుగు రాష్ట్రాల్లో 'ఎన్టీఆర్ మహానాయకుడు' కలెక్ట్ చేసిన మొత్తం దాదాపుగా రెండు కోట్ల రూపాయలు. రెండో రోజుకు కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి కాబట్టి ఈ సినిమా సోమవారం వరకూ నిలబడే పరిస్థితే లేదు. కొద్దోగొప్పో రాబట్టుకావాలంటే ఈరోజు ఆదివారం వరకూ మాత్రమే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా దారుణమైన ఫలితాన్ని అందుకునే దిశగా పయనిస్తోంది. ప్రీమియర్ల ద్వారా $100K సాధించిన ఈ సినిమా శుక్రవారం మరో $40K కలెక్షన్స్ నమోదు చేసింది. శనివారం వివరాలు అందే సమయానికి $25K కలెక్షన్స్ వసూలు చేసింది. బాలకృష్ణకు ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ లేనప్పటికీ ఇంత తక్కువ కలెక్షన్స్ మాత్రం రావు. ఓవరాల్ గా ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలేలా ఉంది.