‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ చాలా గ్యాపే తీసుకున్నాడు. ఆ గ్యాప్ లో బాగా లావెక్కి కనిపించిన ఎన్టీఆర్ ను చూసి జనాలు షాకైపోయారు. ఏదైనా సినిమా కోసం అలా తయారవుతున్నాడేమో అనుకున్నారు కానీ అదేమీ లేదని తేలింది. ఐతే బాబీతో సినిమా కమిటయ్యాక అందుకోసం తారక్ బరువు తగ్గుతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ గత నెల 10న ఈ చిత్ర ప్రారంభోత్సవం నాడు ఎన్టీఆర్ కొత్తగా ఏమీ కనిపించలేదు. పాత అవతారంలోనే కొంచెం బొద్దుగానే ఉన్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి మూడో వారంలోనే సెట్స్ మీదికి వెళ్లింది. కానీ ఎన్టీఆర్ మాత్రం షూటింగులో జాయినవ్వలేదు. అతను ఈ చిత్రం కోసం లుక్ మార్చుకునే పనిలో పడ్డాడు. మార్చి 15 నుంచి ఎన్టీఆర్ సెట్లోకి అడుగుపెట్టనున్నాడు.
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ను దగ్గర్నుంచి చూస్తున్న వాళ్లు చెబుతోందేంటంటే అతను బాగానే సన్నబడ్డాడట. తారక్ స్టన్నింగ్ లుక్ లోకి మారిపోయినట్లుగా వాళ్లు చెబుతున్నారు. ఈ చిత్ర పీఆర్వో కూడా ట్విట్టర్లో ఎన్టీఆర్ లుక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తారక్ దాదాపు 10 కిలోల దాకా తగ్గినట్లు చెబుతున్నారు. ఐతే నెల రోజుల్లో పది కిలోల బరువు తగ్గడమంటే మాటలు కాదు. అది అందరికీ సాధ్యం కాదు. తక్కువ సమయంలో అంత బరువు తగ్గితే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మరి ఎన్టీఆర్ ఎలా మేనేజ్ చేశాడో మరి. బాబీ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక పాత్ర కోసం అతనలా తయారయ్యాడు. మళ్లీ మధ్యలో బరువు పెరిగే అవకాశముంది. తారక్ ఇప్పుడున్న లుక్ తోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంత వరకు ఈ లుక్ బయటికి రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు. ఐతే ఏ చిన్న అవకాశం దొరికినా ఫొటో తీసేసి జనాలు సోషల్ మీడియాలో పెట్టేస్తున్న నేపథ్యంలో అలా దాచడం సాధ్యమేనేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/