రకుల్ ప్రీత్ సింగ్ అదృష్టవంతురాలండీ. ఎప్పుడూ హీరోయిన్ల గురించి మాట్లాడని ఎన్టీఆర్ తల్లి శాలిని తొలిసారి ఆమె గురించి కొడుకు దగ్గర ప్రస్తావించిందట. తన కొడుకు ఇప్పటిదాకా పాతిక సినిమాలు చేసినప్పటికీ అందులో తొలిసారి ఓ హీరోయిన్ గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారట. ఈ సంగతి ఎన్టీఆరే స్వయంగా వెల్లడించాడు. ‘‘నాన్నకు ప్రేమతో సినిమాలో నన్ను చూసి మా అమ్మ ఎంతో సంతోషించింది. నా సినిమాల్లోని హీరోయిన్లను ఎప్పుడూ మెచ్చుకోని అమ్మ తొలిసారి రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడింది. బహుశా రకుల్ తనే డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల ఆమె తెలుగమ్మాయి అనుకుని కనెక్టయిపోయిందేమో’’ అని చెప్పాడు ఎన్టీఆర్.
తన జీవితాంతం ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను గుర్తుంచుకుంటానని ఎన్టీఆర్ అన్నాడు. ‘‘ఈ విజయం తాలూకు అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇది సుకుమార్ ఘనత. నేను బతికున్నంత కాలం ‘నాన్నకు ప్రేమతో’ నాలోనే నిలిచి ఉంటుంది. నేను ఏ గెటప్ వేసినా అది తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకాన్ని నాలో కలిగించిన అభిమానులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. దేవిశ్రీ ఈ సినిమా కోసం చూపించిన కమిట్మెంట్ ను ఎప్పటికీ మరువలేను. సినిమా అయిపోయాక కూడా నాన్నకు ప్రేమతో.. అనే పాట కోసం జనాలు అలాగే థియేటర్లో నిలబడి ఉంటున్నారు. దేవిశ్రీ తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. దేవిశ్రీ తండ్రి సత్యమూర్తిగారే తనతో ఈ పాట రాయించినట్లున్నారు’’ అని ఎన్టీఆర్ అన్నాడు.