జూనియర్ ఎన్టీఆర్ కున్న మాస్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు. ఐతే సోషల్ మీడియా ఫాలోయింగ్ లో, యూట్యూబ్ రికార్డుల విషయంలో మనోడు కొంచెం వెనకే ఉన్నాడన్నది వాస్తవం. ఎప్పుడూ మాస్ మంత్రమే పాటించడం.. క్లాస్ ఆడియన్సుకి మరీ చేరువ కావడం కూడా దీనికి కారణం. యూత్ ఐకాన్, స్టైల్ ఐకాన్ అనిపించుకోవడం మీద తారక్ ఇంతకుముందు పెద్దగా దృష్టిపెట్టలేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య మనోడు స్టైలు మార్చాడు. లుక్ విషయంలో, స్టైలింగ్ విషయంలో కొత్త రూట్లో వెళ్తున్నాడు. ‘టెంపర్’ సినిమాతో ఆ దిశగా మంచి పునాది పడింది.
ఇప్పుడు సుకుమార్ లాంటి స్టైలిష్ డైరెక్టర్ తోడయ్యేసరికి ఇక ఎన్టీఆర్ ఒక్కసారిగా మేకోవర్ అన్నట్లే తయారయ్యాడు. ‘నాన్నకు ప్రేమతో’ కోసం ఎన్టీఆర్ ఎత్తిన కొత్త అవతారానికి ఎలాంటి స్పందన వస్తోందో తెలిసిందే. ఇప్పటికే లుక్స్ తో పడేసిన జూనియర్.. తాజాగా టీజర్ తో ఇంకాస్త గట్టిగానే కొట్టాడు. నిన్న సాయంత్రం 6 గంటలకు యూట్యూబ్ లో విడుదలైన టీజర్ పెద్ద సెన్సేషనే క్రియేట్ చేస్తోంది. మరో మాట లేదు.. టీజర్ ఇన్ స్టంట్ గా ఎక్కేసింది జనాలకు. ఎన్టీఆర్ కెరీర్లో ఎప్పుడూ ఇలా కనిపించింది లేకపోవడంతో జనాలు చాలా ఆసక్తిగా మళ్లీ మళ్లీ టీజర్ చూస్తున్నారు. దీంతో హిట్లు అదిరిపోతున్నాయి. 12 గంటల్లోనే 5 లక్షల మార్కు అందుకుంది ‘నాన్నకు ప్రేమతో’ టీజర్. రోజు గడిచేసరికి మిలియన్ మార్కు అందుకున్నా ఆశ్చర్యమేమీ లేదు. ఎన్టీఆర్ టీజర్లలో ఇదే రికార్డు.