కొత్త కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం పోటీపడిన ఎన్టీఆర్!

Update: 2021-09-23 02:48 GMT
వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తుంటారు. తాము ఉపయోగించే కార్లు తమ స్థాయిని ప్రతిబింబించేలా ఉండాలని భావిస్తారు. అందుకే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కార్లను వెంటనే కొనుగోలు చేస్తూ ఉంటారు .. తమ ముచ్చటను తీర్చుకుంటూ ఉంటారు. అంత విలువైన కార్లకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చేదిగా ఫాన్సీ నెంబర్ కనిపిస్తుంది. చాలామంది తమ అదృష్ట సంఖ్య తమ కారు నెంబర్ గా వచ్చేలా చూసుకుంటారు. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు.

ఎన్టీఆర్ తన అదృష్ట సంఖ్య 9 గా భావిస్తారు. అందువలన ఆయన తన కార్లకి 9999 వచ్చేలా చూసుకుంటారు. తన తాతయ్య 9999 నంబరు గల కారును ఉపయోగించేవారనీ .. అలాగే తన తండ్రి కూడా అదే నంబర్ గల కారును వాడేవారనీ .. అందుకే ఆ నెంబర్ తనకి సెంటిమెంట్ అని కూడా ఎన్టీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పాడు. ఇటీవల ఆయన లాంబోర్గిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు ఖరీదు 3.43 కోట్లు అని అంచనా.  ఇండస్ట్రీకి చెందిన ఎన్టీఆర్ సన్నిహితులు చాలామంది ఈ కారును చూడటానికి ఉత్సా హాన్ని చూపించారంటే అది ఎంత ముచ్చటగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి ఈ కారుకి ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలంలో ఎన్టీఆర్ పోటీపడ్డాడు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు .. ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం నిర్వహించారు. TS 09 FS 9999 అనే ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకోవడానికి ఎన్టీఆర్ ఆసక్తిని చూపించాడు. ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆయన 17 లక్షలను చెల్లించాడు. ఇలా ఫ్యాన్సీ నెంబర్ల కోసం భారీ మొత్తం  చెల్లించే విషయంలో గతంలో తన పేరు మీదనే ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసినట్టుగా చెబుతున్నారు. అదే రోజున మరో రెండు ఫ్యాన్సీ నెంబర్లను భారీ రేటుకు అమ్మడవలన, ఆర్టీఏ అధికారులకు 45 లక్షల 52 వేల 921 రూపాయలు వచ్చాయట.  
Tags:    

Similar News