టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బయోపిక్ గా షూటింగ్ ప్రారంభించుకున్న ఎన్టీఆర్ రెండు భాగాలూ వచ్చేసాయి. కేవలం నెలన్నర వ్యవధిలో కథానాయకుడు సీక్వెల్ మహానాయకుడు ప్రేక్షకులను పలకరించింది. ఫలితాల సంగతి పక్కన బెడితే బాలకృష్ణ చేసిన ప్రయత్నం నందమూరి అభిమానుల నుంచి ఆశించిన స్పందన దక్కించుకోలేదన్న కామెంట్ మీద ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదలా ఉంచితే తాతయ్య కథతో తీసిన సినిమా గురించి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటిదాకా ఎక్కడా స్పందించనే లేదు.
కథానాయకుడు సంక్రాంతికి రిలీజైనప్పుడు ఏ సంబంధం లేని మహేష్ బాబు బాలయ్యను సినిమాను పొగడ్తలతో ముంచెత్తగా అదే ట్విట్టర్ వేదికగా తారక్ చిన్న మాట కూడా అనలేకపోయాడు. ఇప్పుడు మహానాయకుడు వంతు వచ్చింది. బాలకృష్ణను కాసేపు పక్కన పెట్టినా స్వంత అన్నయ్య రెండూ సినిమాల్లోనూ ఉన్నాడు. ఏదో వేషం కాదు. నాన్న హరికృష్ణ నిజ జీవిత పాత్ర చేసాడు. దాని కోసమైన ఓ మెసేజ్ ట్వీట్ చేయొచ్చు. మహానాయకుడు వచ్చేసినా జూనియర్ ఇప్పుడూ మౌనాన్నే ఆశ్రయించడం నందమూరి అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది.
ఆడియో రిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ మా తాత కథను బాబాయ్ సినిమా రూపంలో ఇదిగో మీ తాత తీసాడని చూపిస్తామని ఓ రేంజ్ లో పొగిడాడు. దాని తర్వాత ఎలాంటి ఊసు లేదు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ అని తప్పుకోవడానికి లేదు. దుబాయ్ వెళ్ళాడు. చరణ్ తో మాత్రమే జరిగిన షెడ్యూల్ లో తను రిలాక్స్ అయ్యాడు. ఆ సమయంలో ఏదో ఒకటి ట్వీటోచ్చు. అయినా కూడా చేయలేదు అంటే కారణం ఏమై ఉంటుందో. హరికృష్ణ మరణం తర్వాత బాబాయ్ అబ్బాయ్ ఫుల్ గా కలిసిపోయారు అనుకుంటే ఈ మౌనం కొత్త అనుమానాలు రేపుతోంది