టీవీ ప్రోగ్రాంలకు సినిమా స్టార్లు హోస్ట్ చేయడం అనే ట్రెండ్ కౌన్ బరేగా కరోడ్ పతి నుంచి స్టార్టయింది. అమితాబ్ బచ్చన్ హాస్టింగ్ కారణంగానే ఈ ప్రోగ్రాం ఎంతో జనాదరణ దక్కించుకుంది. ఈ ప్రోగ్రాం తెలుగు వెర్షన్ ను ముందు యాంకర్ ఝాన్సీతో ట్రై చేశారు. కానీ ప్రేక్షకాదరణ లేక కొద్దికాలానికే ఆపేశారు. చాలా టైం గ్యాప్ తర్వాత నాగార్జున హోస్ట్ గా ఎంపిక చేసి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. నాగార్జునకున్న పాపులారిటీ కారణంగా ఈ ప్రోగ్రాంకు మంచి వ్యూయర్ షిప్ వచ్చింది.
ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ ఉన్న నటులు హోస్ట్ చేస్తున్నారంటేనే ఆ ప్రోగ్రాంపై ఎక్కడ లేని ఆసక్తి ఏర్పడుతోంది. దాంతో సహజంగానే రేటింగులు పెరుగుతాయి. అందుకే భారీ రెమ్యూనరేషన్లు ఇచ్చి వెండితెర హీరోలను టీవీ ప్రోగ్రాంలకు తీసుకొస్తున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస్ కోసం ఎన్టీఆర్ మొదటిసారిగా హోస్ట్ అవతారం ఎత్తాడు. దీంతో బిగ్ బాస్ పై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఈ ప్రోగ్రాంలో కంటెస్టెంట్లలో పాపులర్ ఫిగర్స్ లేకపోయినా కేవలం ఎన్టీఆర్ హోస్టింగే ప్రేక్షకులను టీవీ ముందు కూర్చోబెట్టింది. ఈ విషయంలో స్టార్ మా ప్లానింగ్ వర్కవుట్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు స్టార్లు హోస్టింగ్ చేసిన కార్యక్రమాలన్నీ మనసులో మాట పంచుకోవడమో.. ఆటలు ఆడించడం లాంటివే. వాటిలో పేరు మార్పు తప్ప మిగతాదంతా పెద్ద స్పెషలేం ఉండదు.
బిగ్ బాస్ విషయానికి వచ్చేసరికి ఈ కాన్సెప్టే తెలుగు ప్రేక్షకులకు కొత్త. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన పద్నాలుగు మంది మధ్య మాటామాటా తేడా వచ్చేంతవరకు అందులో ఆసక్తికరమైన విషయం అంటూ ఏమీ ఉండదు. అంటే దాదాపు ఈ వారం అయ్యేవరకు అసలు లోపల ఏం జరుగుతుంది అనే క్లారిటీ మాత్రం రాదు. అంతవరకు ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేయగలిగేది ఎన్టీఆర్ ఒక్కడే. అందుకే ఎన్టీఆర్ కు స్టార్ మా భారీ రెమ్యూనరేషన్ ముట్టజెప్పి అతడిని తెరముందుకు తెచ్చింది. ఈ ప్రోగ్రాం ముందుముందు ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూద్దాం..