జూనియర్ గెడ్డం సీక్రెట్ ఏంటంటే..

Update: 2015-12-18 04:18 GMT
నాన్నకు ప్రేమతో చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. స్టైలింగ్ విషయంలో అయితే కత్తిలా ఉన్నాడని అనడం కూడా తక్కువే. ముఖ్యంగా హెయిర్ స్టైల్ - గెడ్డం విషయంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. గెడ్డంతో ఇంత స్టైల్ గా కనిపించచ్చని ప్రూవ్ చేసేస్తున్నాడు కూడా.

మరి ఈ న్యూ ఏజ్ గెటప్ వెనుక సీక్రెట్ ఏంటి? ఇదే విషయాన్ని యంగ్ టైగర్ ని మీడియా అడిగేసింది. కానీ జూనియర్ మాత్రం చాలా చాకచక్యంగా తప్పించేసుకున్నాడు. దీనికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెబ్తానని, ఇప్పుడు చెప్పడం కుదరదని తేల్చేశాడు. మరి ఇలా కుదరదని చెబ్తే.. మీడియా జనాలు వదిలేస్తారా ఏంటి ? దానికోసం పడ్డ కష్టమైనా చెప్పాలని డిమాండ్ చేయడంతో.. ఆ సంగతులు మాత్రం పంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

"అసలు ఇలాంటి స్టైల్ సెట్ చేయడమంటే అదో రాడికల్ స్టెప్. ఇందుకోసం చాలానే రీసెర్చ్ చేశాం. చాలా అంటా చాలానే చేశాం. ఇప్పుడు యూత్ ఎలాంటి స్టైల్స్ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా బ్రెజిలియన్ స్టైల్స్ ఎలా ఉన్నాయి వంటి విషయాలను చాలా లోతుగా పరిశీలించాం. మిగిలిన విషయాలు ఆడియో ఫంక్షన్ లో " చెప్పుకుందాం అన్నాడు యంగ్ టైగర్.

నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ ని క్రిస్మస్ రోజున ప్లాన్ చేశారు కానీ.. ప్రస్తుతం ఆ డేట్ సాధ్యం కాదు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి మరణంతో ఈ ఫంక్షన్ ను వాయిదా వేశారు. త్వరలోనే డేట్ ను అనౌన్స్ చేయనుంది మూవీ యూనిట్.
Tags:    

Similar News