జూనియర్ సైలెన్స్ ఎందుకో!!

Update: 2016-03-26 03:53 GMT
రీసెంట్ గా విడుదలైన ఊపిరి మూవీకి.. అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ వచ్చింది. మొదటి షో నుంచే హిట్ అనే టాక్ తెచ్చేసుకుంది ఊపిరి. కుర్చీకే పరిమితమైన అక్కినేని నాగార్జున పెర్ఫామెన్స్ - ఊర మాస్ కేరక్టర్ లో కార్తి పాత్ర ఆడియన్స్ నుఅమితంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ మూవీ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఊపిరి సినిమా కోసం ఎన్టీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే.. ఈ సినిమాలో కార్తి చేసిన రోల్ కోసం.. మొదట యంగ్ టైగర్ నే అడిగారు. ఈ నందమూరి హీరో కూడా సినిమా చేసేందుకు ఆసక్తి ప్రదర్శించాడు. కానీ అనుకోకుండా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో చివరకు సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తను మిస్ చేసుకున్న సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎమోషనల్ గా కూడా సూపర్బ్ అనిపించుకుంటోంది. కార్తి పెర్ఫామెన్స్ కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పైగా ఈ రోల్ ను జూనియర్ చేయాల్సి ఉందని నాగ్ ఓపెన్ గానే చెప్పాడు కూడా.

ముంబైలో జనతా గ్యారేజ్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం హైద్రాబాద్ వచ్చేశాడు జూనియర్. ఇప్పుడు ఊపిరి రిలీజ్ అయ్యి.. సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత అయినా... ఆ సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడితే ఏమవుతుంది అనుకుంటున్నారు చాలామంది. ప్రెస్ మీట్స్ లాంటివి కాకపోయినా.. ఎట్ లీస్ట్ ట్విట్టర్ లాంటి సోషల్ ప్లాట్ ఫామ్స్ లో ఓ ట్వీట్ పెట్టినా.. తన ఒపీనియన్ కన్వే అవుతుంది కదా. ఏ మాత్రం స్పందించకపోవడం మాత్రం ఎన్టీఆర్ ను విమర్శల పాలు చేస్తోంది.
Tags:    

Similar News