సినిమాకు ప్రమోషన్ అనేది ఎంత ముఖ్యమో మన స్టార్ హీరోలకు ఈ మధ్య బాగానే తెలిసొస్తున్నట్లుంది. సినిమాను సరిగా ప్రమోట్ చేస్తే తమ మార్కెట్ స్థాయిని మించి వసూళ్లు రాబట్టవచ్చని.. సినిమా సినిమాకూ రేంజి పెంచుకోవచ్చని హీరోలందరూ బాగానే అర్థం చేసుకుంటున్నారు. సినిమాను ప్రమోట్ చేయడంలో మీడియా పాత్రను గుర్తిస్తూ.. దానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తున్నారు. దాదాపుగా ప్రతి హీరో కూడా మీడియా ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతకుముందు మీడియాతో పెద్దగా కలవని జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ మధ్య రూటు మార్చాడు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు అన్ని వర్గాల మీడియాకూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అంతే కాక సినిమా సక్సెస్ అయ్యాక మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా పార్టీ కూడా ఇచ్చాడు.
సినిమా ఉన్నపుడే తమను పట్టించుకుంటాడేమో అన్న ఫీలింగ్ రాకుండా తన పుట్టిన రోజు ముందు కూడా మీడియా వాళ్లకు స్పెషల్ పార్టీ ఇవ్వాలని ఫిక్సయ్యాడట తారక్. మే 20న తన 33వ బర్త్ డే సందర్భంగా మీడియాకు ఘనంగా పార్టీ ఇవ్వబోతున్నాడట జూనియర్. ఇంకా ఈ విషయమై మీడియా ప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదు. ఐతే సన్నాహాలు మాత్రం జరుగుతున్నాయి.
బాలీవుడ్లో అమీర్ ఖాన్ కు తన ప్రతి పుట్టిన రోజునూ మీడియాతో కలిసి చేసుకోవడం.. వాళ్లకు పార్టీ ఇవ్వడం అలవాటు. టాలీవుడ్లోనూ కొందరు హీరోలు మీడియా వాళ్లను ప్రత్యేకంగా గౌరవిస్తుంటారు. ఇప్పుడు తారక్ కూడా ఆ జాబితాలో చేరాడు. తమ అవసరాలకు మీడియా వాళ్లను వాడుకునే వాళ్లే కానీ.. ఇలా ప్రత్యేకంగా గౌరవించేవాళ్లు ఎంతమంది ఉంటారు చెప్పండి.