ఈ ఏడాది వచ్చిన అత్యుత్తమ తెలుగు చిత్రాల్లో మనమంతా.. పెళ్లిచూపులు పేర్లు కచ్చితంగా ఉంటాయి. ఈ రెండు సినిమాలూ రాజమౌళికి బాగా నచ్చాయి. వాటి గురించి పాజిటివ్ గా ట్వీట్లు పెట్టాడు.. వాటి రూపకర్తల్ని అభినందించాడు కూడా. జక్కన్న మిత్రుడైన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాల గొప్పదనాన్ని గుర్తించాడు. ఈ సినిమాలపై ప్రశంసలు కురిపించాడు. తెలుగు సినిమాల్లో వస్తున్న మార్పుకు ఈ సినిమాలు నిదర్శనమని ఎన్టీఆర్ చెప్పాడు. ‘‘ప్రపంచం మారుతోంది. మనం కూడా మారాలి. అదృష్టవశాత్తూ మన దగ్గర ఆ మార్పు కనిపిస్తోంది. పెళ్లిచూపులు.. మనమంతా లాంటి మంచి సినిమాలు రావడం శుభ పరిణామం’’ అని ఎన్టీఆర్ అన్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్లో వస్తున్న మార్పులో తాను కూడా భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని ఎన్టీఆర్ చెప్పాడు. ‘‘ఒకే తరహా సినిమాలు చేస్తాం.. మీరు చూడాల్సిందే అంటే ప్రేక్షకుల నుంచి చెంపదెబ్బలు పడతాయి. అలాంటి దెబ్బలు తిన్నాక నేనూ మారాను. మాకేదో స్టార్ డమ్ ఉంది. మేమేదో స్టార్లం అనుకుంటాం. అలాంటిదేమీ ఉండదు. మనమేంటో నిరూపించుకోవాలంటే మంచి కథలు ఎంచుకోవాలి. ‘నాన్నకు ప్రేమతో’ నిజానికి నా తరహా సినిమాలాగా ఉండదు. ఆ సినిమా విషయంలో ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయలేదు. కష్టపడి తీశాం.. చూడండి అని అల్టిమేటం కూడా వేయలేదు. కానీ జనాలకు నచ్చింది. కొత్తగా అనిపించింది. ఆదరించారు’’ అని ఎన్టీఆర్ అన్నాడు.