జై లవకుశ రానున్న రోజుల్లో ఎంత విజయం సాధిస్తుందో గాని సినిమా ప్రమోషన్స్ కి అయితే చిత్ర యూనిట్ చాలా కష్టపడిందనే చెప్పాలి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాపై ప్రమోషన్స్ కూడా భారీ అంచనాలు పెంచాయి. ఏ మాత్రం తీరిక లేకుండా ఓ వైపు ఎన్టీఆర్ మరో వైపు హీరోయిన్స్ నివేద థామస్ - రాశి ఖన్నా ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొన్నారు. అలాగే నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒక ఫన్నీ విషయం తారక్ తెలిపాడు. ఎలాగైనా తప్పకుండా నివేద థామస్ కి ఒక ఫుడ్ ఐటెమ్ ని స్వయంగా తానే వంట చేసి పెడతానని సమాధానాన్ని ఇచ్చాడు. ఆ వంటకం పెరు 'బిసిబిల్లా బాత్' అని తారక్ తెలిపాడు. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ - జై లవకుశ మూడు పాత్రలు చేసి చాలా బిజీగా ఉండేవాన్ని...దీంతో గ్యాప్ దొరక్క చాలా మిస్ అయ్యాను. జై లవకుశ రిలీజ్ తర్వాత తప్పకుండా ఒకరోజు స్పెషల్ వంట చేసి నివేదకు పెడతానని తారక్ వివరించాడు.
ఇక జై లవకుశ సినిమా ఈరోజు భారీ స్థాయిలో రిలిజ్ కానుంది. తారక్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్ రవీంద్ర దర్శకుడు.