ఈ మధ్య తెలుగులోకి వస్తున్న పరాభాషా కథానాయికలందరూ మన భాషను నేర్చేసుకుంటున్నారు. గల గలా తెలుగులో మాట్లాడేస్తున్నారు. బయట మాత్రమే కాదు.. సినిమాల్లోనూ తమ గొంతు వినిపించడానికి ఉత్సాహ పడుతున్నారు. ఛార్మి.. రకుల్ ప్రీత్ లాంటి కథానాయికలు ఇప్పటికే తమ గొంతు వినిపించడం తెలిసిన సంగతే. ఈ కోవలోకే రాశి ఖన్నా కూడా చేరాలనుకుంటోంది. మంచి వాయిస్ ఉన్న రాశి.. ‘జోరు’ సినిమాలో ఓ పాట కూడా పాడిన సంగతి తెలిసిందే. బయట ఏ తడబాటూ లేకుండా తెలుగులో చక్కగా మాట్లాడేసే రాశి.. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ అయిన ‘జై లవకుశ’లో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవాలని ఆశించిందట.
ఈ విషయాన్ని దర్శకుడు బాబీతో డిస్కస్ చేసి.. అతడిని ఒప్పించిందట. కానీ రాశికి ఎన్టీఆర్ బ్రేక్ వేసినట్లు సమాచారం. ‘జై లవకుశ’ను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి ఎన్టీఆర్ అండ్ టీం ఎంత కష్టపడిందో తెలిసిందే. అన్నీ పర్ఫెక్ట్ అనుకున్న సమయంలో రాశితో డబ్బింగ్ చెప్పించడం మొదలు పెడితే.. ఆలస్యం కావచ్చని.. ఏమైనా తేడా వచ్చి మళ్లీ డబ్బింగ్ ఆర్టిస్టుతో మొదట్నుంచి డబ్బింగ్ చెప్పించాల్సి వస్తే ఆలస్యమవుతుందని.. అందుకే ఇప్పుడు రిస్క్ వద్దని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. దీంతో రాశి ఖన్నా ఉత్సాహానికి బ్రేకులు పడిపోయాయి. ఐతే ఆమె నిరాశ చెందాల్సిన పని లేదని.. తర్వాత అయినా ప్రయత్నించవచ్చని తారక్ సర్ది చెప్పాడట. రాశి కూడా తన తర్వాతి సినిమాలో డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తోంది.