​ఎన్టీఆర్ ఎంత పుచ్చుకుంటున్నాడంటే..

Update: 2017-07-09 04:40 GMT
తెలుగు టి‌వి రంగం ఇప్పుడు కొత్త పుంతలుతో పరుగులు పెడుతుంది. మెగా స్టార్, కింగ్ నాగ్ లాంటి వారు కూడా బుల్లితెర అవకాశాలును అందిపుచ్చుకుంటున్నారు. అటు రానా తన అల్లరితో సందడి చేసుకొని వెళ్తున్నాడు. కాని ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ షో పై పడింది. షోలో ఉండే విశేషాలు చూడటానికికన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలా హోస్ట్ చేస్తాడా అనేది చూద్దాం అని చాలామంది తెలుగు వీక్షకులు ఎదురుచూస్తున్నారు.

జూలై 16 నాడు ప్రసారం అవ్వబోతున్న బిగ్ బాస్ కోసం మనోడు భారీగా పైకం తీసుకుంటున్నాడనే టాక్ కు ఆల్రెడీ నిన్ననే సమాధానం చెప్పాడు. అయితే ఈ షో కోసం మనోడు ఎంత పుచ్చుకుంటుంది ఫైనల్ గా బయటకొచ్చింది. “నాకు స్టార్ మా వాళ్ళు  నా భార్య పిల్లాడు ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి సరిపడేంత సొమ్ము ఇచ్చారు.. అందుకు చాలా థాంక్స్. కాని బయట వినిపిస్తున్న అంత మొత్తం నేను తీసుకోవటంలేదు'' అని చెప్పాడు ఎన్టీఆర్. రూమర్ల ప్రకారం మనోడు ఒక్కో సీజన్ కు సుమారుగా 8 కోట్లు చార్జ్ చేసినట్లు టాక్. కాకపోతే సీజన్ బట్టి కాకుండా.. ఎపిసోడ్ కు 50 లక్షలు చొప్పున తీసుకుంటున్నాడట ఎన్టీఆర్. అంటే మొత్తం అన్ని ఎపిసోడ్ లకు కలిపి 6 కోట్లు అన్నమాట. ఈ సీజన్ లో ఉన్న అన్నీ ఎపిసోడ్ లకు ఎన్టీఆర్ రాడు. వీకెండ్ లో మాత్రమే కనిపిస్తాడు.

ఆ లెక్కన చూస్తే.. 70 రోజుల సమయంలో తన అతి తక్కువ కాల్ షీట్లకు అతి ఎక్కువ పేమెంట్ ఇదే అనుకోవాలి. ప్రస్తుతం ఒక సినిమాకోసం అయితే ఎన్టీఆర్ 10 నుండి 15 కోట్ల మధ్యలో తీసుకుంటున్నాడనేది టాక్.
Tags:    

Similar News