ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవ కుశ మూవీ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 21 రిలీజ్ డేట్ టార్గెట్ తో.. ఫుల్ స్పీడ్ లో వర్క్ చేసేస్తున్నారు టీం. మరోవైపు యంగ్ టైగర్ ఇప్పుడు బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు వెర్షన్ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది.
భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా అందుకుని బిగ్ బాస్ ప్రోగ్రాం చేస్తున్నాడు జూనియర్. మరి కొన్ని రోజుల్లోనే ఈ ప్రోగ్రాం షూటింగ్ ప్రారంభం కానుంది. పూనే లో ఉన్న బిగ్ బాస్ భారీ సెట్ లో ఈ కార్యక్రమం కోసం షూటింగ్ జరగనుంది. అయితే.. ఈ రియాల్టీ షో కాన్సెప్ట్ ప్రకారం 70 రోజుల పాటు పార్టిసిపెంట్స్ అక్కడే అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సి ఉంటుంది. వీరితో పాటు జూనియర్ కూడా ఈ 70 రోజులు అక్కడే అందుబాటులో ఉండాలి. ఒప్పందం ప్రకారం వారానికి 2 రోజుల పాటు ఎన్టీఆర్ షూటింగ్ కి వెళ్తే సరిపోతుంది.
కానీ ఈ 70 రోజుల్లో ఎప్పుడు ఏ అవసరం కోసం బిగ్ బాస్ టీం కాల్ చేసినా ఎన్టీఆర్ వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈ 70 రోజులు ఎన్టీఆర్ పూనేలోనే ఉండనుండగా.. జూనియర్ తో పాటు జై లవ కుశ టీం కూడా అక్కడికే షిఫ్ట్ అయిపోనుంది. ఇక్కడి నుంచి జై లవ కుశ రిలీజ్ సమయానికి కూడా ఇంకా 75 రోజుల గ్యాప్ మాత్రమే ఉండడం విశేషం.