తండ్రులందరికీ ఈ చిత్రం నీరాజనం -ఎన్టీఆర్

Update: 2015-12-28 03:36 GMT
నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ అంతా ఎమోషన్స్ తో నిండిపోయింది. తాను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదని, అసలు నటుడు అవుతాననే అనుకోలేదని.. అయితే వెన్ను తట్టి పంపింది మాత్రం తన తండ్రి హరికృష్ణే అని చెప్పాడు యంగ్ టైగర్.

ఏరోజూ పిరికి పందల్లా బతికాల్సిన అవసరం రాలేదని, ఆయన పేరు కానీ తాత పేరు కానీ చెప్పుకుని బతికే పరిస్థితి కల్పించలేదని, మీరు మీరుగా బతకండి అని నాన్న చెప్పేవారని అన్నాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో చిత్రం సుకుమార్ తండ్రి కొన ఊపిరితో ఉన్నపుడు పుట్టిందని, ఈ సినిమాలో ప్రతీ కేరక్టర్ లోనూ సుకుమార్ మాత్రమే కనిపిస్తాడని అన్నాడు ఎన్టీఆర్. తండ్రి బాధకు నివాళిగా ఈ కథ రాశారని, సుకుమార్ లాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో రాడని తేల్చేశాడు యంగ్ టైగర్.

ఇలాంటి గొప్ప కథ తన 25వ చిత్రంగా చేయడం, తన అదృష్టం అన్నాడు ఎన్టీఆర్. అలాగే ఈ సినిమా కోసం దేవిశ్రీ పంపినా త్యాగం ఎవరికీ అర్ధం కావడంలేదన్న జూనియర్.. తండ్రి చనిపోయిన మూడో రోజు.. ' తండ్రి కార్యకలాపాలు పూర్తి చేశాను, అమ్మను జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఓ పాట రికార్డింగ్ ఫినిష్ చేశాను, మా నాన్న నేను పని ఆపేయడాన్ని ఇష్టపడరు' అని డీఎస్పీ తనకు పంపిన ఓ మెసేజ్ ని చదివి వినిపించాడు ఎన్టీఆర్.  

జగపతి బాబుతో తనకు ఉన్న రిలేషన్ ఎంటో చెప్పలేలన్నాడు. ఆయన ఓ  బ్రదర్ - ఓ ఫ్రెండ్ - ఓ అన్నయ్య - ఓ తమ్ముడు - ఓ చెల్లి - ఓ భార్య - ఓ బిడ్డ.. అన్నీ అన్నాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో.. కేవలం సినిమా కాదని.. తండ్రులందరికీ, తల్లులందరికీ తాము అందించే నీరాజనం అని ఉద్విగ్నంగా చెప్పాడు. చివరలో ఈ ఫంక్షన్ కు వచ్చిన అందరూ.. ఇంటికి క్షేమంగా వెళ్లాలని, ప్రేమతో ఇంటికి తిరిగొచ్చామని చెప్పాలని కోరి.. జై ఎన్టీఆర్ అంటూ తన మాటలను పూర్తి చేశాడు జూనియర్ నందమూరి తారక రామారావు.
Tags:    

Similar News