ముంబయి ఈవెంట్ లో ఎన్టీఆర్ అలా అన్నాడేంటి..!

Update: 2022-01-02 06:38 GMT
ఆర్ ఆర్‌ ఆర్ సినిమా విడుదల ఆగిపోయినా కూడా చర్చ మాత్రం ఆగడం లేదు. జనవరి 7వ తారీకున విడుదల అవ్వాల్సిన ఆర్ ఆర్ ఆర్ ను వాయిదా వేయడం జరిగింది. కొత్త విడుదల తేదీని ఎప్పటికి ప్రకటిస్తారో కూడా తెలియదు. ఏప్రిల్‌ అంటూ కొందరు.. జులై అంటూ కొందరు.. దసరాకు అంటూ మరి కొందరు ఊహిస్తున్నారు. సినిమా విడుదల విషయం అలా ఉంచితే.. ముంబయిలో ఇటీవల సల్మాన్ ఖాన్‌ స్పెషల్‌ గెస్ట్‌ గా ఆర్ ఆర్‌ ఆర్‌ ప్రీ రిలీజ్‌ వేడుక వైభవంగా జరిగింది. ఆ వేడుకలో చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇద్దరు కూడా గతంలో ఎప్పుడూ చూడనంత యాక్టివ్ గా అందరి దృష్టిని ఆకర్షించేలా ఎనర్జిటిక్‌ ఫెర్ఫార్మెన్స్‌ ను ఇచ్చారు.

ముంబయి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను లైవ్ ఇవ్వకుండా జీ ఛానల్ వారు డిసెంబర్‌ 31 రాత్రి టెలికాస్ట్‌ చేయడం జరిగింది. కొత్త సంవత్సరంకు ఆర్ ఆర్ ఆర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ను చూస్తూ ఉత్తరాది వారు స్వాగతం పలికారు. సౌత్‌ లో కూడా భారీ ఎత్తున ఆ ఈవెంట్‌ ను చూశారని భారీ రేటింగ్‌ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈవెంట్ మొత్తం కూడా చాలా స్పెషల్‌ గా సాగింది. హీరోలు ఇద్దరు మాట్లాడిన మాటలు రాజమౌళి మాట్లాడిన మాటలు మరియు సల్మాన్‌ ఖాన్ సినిమా గురించి చెప్పిన మాటలు అన్ని కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ తన స్పీచ్ ను ముగించిన సమయంలో జై హింద్ అంటూ నినదించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

జై హింద్‌ అంటూ సాదారణంగా అయితే పవన్ కళ్యాణ్ తన స్పీచ్ ను ముగిస్తూ ఉంటాడు. ఆ పదం ఆయనకే సొంతం అని కాదు కాని.. ఎప్పుడు లేనిది ఎన్టీఆర్‌ జై హింద్ అని అది కూడా ముంబయి ఈవెంట్‌ లో ఎందుకు చెప్పాడా అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ వంటి స్టార్ ఏదో కాకతాళీయంగా అని ఉంటాడు లే అని వదిలేయడానికి లేదు. ఆయన వక్తగా ఎంతటి పేరును దక్కించుకున్నాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా చాలా ఆలోచించి ఆచి తూచి వస్తుంది. ఆయన వాడే భాష.. ఆయన యాస ఇలా ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా కారణం కలిగి ఉంటుంది. కనుక జై హింద్ అనే పదం ను ఎందుకు ఆయన ఉపయోగించాడో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ విషయంపై క్లారిటీ రావాలంటే ఆయనే నోరు విప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News