ఎన్టీఆర్‌ కు టిక్కు పెట్టేశారుగా...

Update: 2016-03-22 09:33 GMT
అక్కడంతే. ఒకప్పుడు హీరో సూర్య తెగ ట్వీట్లు పెట్టేశేవాడు. ట్వీట్ల మీద ట్వీట్లు. అర్ధరాత్రి అపరాత్రి.. పండగ నాడు.. సెలవ రోజున.. తెగ ట్వీట్లు పెట్టేశేవాడు. కొంతమంది సెలబ్రిటీలకు రిప్లయ్‌ కూడా ఇచ్చేవాడు. తీరా ఒకరోజు లైవ్‌ లో.. మీరు ట్విట్టర్‌ లో భలే యాక్టివ్‌ గురువు గారూ అంటే.. ''నేనా ట్విట్టరా? నాకు సేవింగ్స్‌ బ్యాంక్‌ ఎకౌంట్‌ తప్పించి.. ట్విట్టర్‌ ఎకౌంట్‌ లేదే'' అన్నాడు సూర్య. అప్పుడు అర్ధమైంది జనాలకు.. ట్విట్టర్‌ వారు వెరిఫై చేసి పక్కనో బులుగు రంగు టిక్కు మార్కు పెడితేనే అది ఒరిజినల్‌ ఎకౌంట్‌ అవుతుందని.

ఇప్పటికే 5 లక్షల ఫాలోవర్లు ఉన్న గగగగ అనే ఎకౌంట్‌ కు ఇంతవరకు ఎలాంటి వెరిఫికేషన్‌ లేదు. ఆ ఎకౌంట్‌ ఎవరిది సుమీ అన అడగకండే. అది మన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ది. ఆయన అప్పట్లో 2010లో ఒకసారి కొన్ని ట్వీట్లు వేశాడు. ఆ తరువాత మళ్లీ 2014లో ఓ నాలుగు ట్వీట్లు వేశాడు.. 2015లో మరి కొన్ని ట్వీట్లు వేశారు. ఇక జనవరి 2016లో నాన్నకు ప్రేమతో సినిమాను హిట్‌ చేసినందుకు థ్యాంక్స్‌ అంటూ ఆఖరి ట్వీట్‌. అయితే ఈ ఎకౌంట్‌ ఒరిజనల్లా కాదా అనే సందేహం ఉంటే మాత్రం.. మీరు ఖంగారకపడక్కర్లేదు. ఇవాళే ఈ ఎకౌంటుకు ట్విట్టర్‌ వారు ''టిక్కు'' పెట్టేశారు. అది సంగతి.
Tags:    

Similar News