కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆలస్యం విషయంలో తారక్ అభిమానులు సీరియస్ గా ఉన్నారు. డిలేకు కారణమేమిటో అర్థం కాని గందరగోళంలో ఉన్నారు.
అయితే ఈ ఆలస్యానికి కారణాలు అనేకం ఉన్నాయని ఇటీవల కథనాలొస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాత ఎన్టీఆర్ వెంటనే సినిమాని ప్రారంభించాలనుకున్నా కానీ ఇప్పుడు అతడు పాన్ ఇండియా స్టార్ గా కొత్త ఇమేజ్ ని అందుకున్నారు. దానికి తగ్గ కథాంశాన్ని కొరటాల సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దానివల్లనే అతడు ఇంకా చాలా సమయం తీసుకుంటున్నారని కూడా గుసగుసలు వినిపించాయి. తాజా చిత్రం తారక్ కి కొరటాలకు కూడా గేమ్ ఛేంజర్ కావాలన్నది ఆలోచన. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ పై సీరియస్ గా రీవర్క్ చేస్తున్నారని దీనివల్ల అక్టోబర్ వరకూ షూటింగ్ ని ప్రారంభించరని కూడా తెలుస్తోంది.
తారక్ కి 4 వారాల విశ్రాంతి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం ఎంతగా శ్రమించారో తెలిసిందే. ఈ మూవీ కోసం ఏకంగా రెండేళ్ల పాటు అవసరం మేర కాల్షీట్లను అంకితం చేసారు. అతడు ఇతర సినిమాల్లో కూడా నటించలేదు. ఇక జక్కన్న హార్డ్ హిట్టింగ్ యాక్షన్ సన్నివేశాల కోసం తారక్ చాలా రిస్కులే చేశారు. కారణం ఏదైనా కానీ అతడికి భుజం నొప్పి ఇబ్బంది పెడుతోందని తెలిసింది. అదే క్రమంలో ఎన్టీఆర్ కు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నాలుగు వారాల పాటు అతడు షూటింగుల్లో పాల్గొనకూడదని తెలిసింది.
నిజానికి హీరోలు యాక్షన్ సీక్వెన్స్ ల విషయంలో రిస్కులు చేయడం మామూలే. అతి భారీ యాక్షన్ ఎపిసోడ్ లను చిత్రీకరించడానికి రోప్ లను కూడా ఉపయోగిస్తుంటారు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా రిస్కులు చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. కొందరికి నడుము నొప్పి.. మరికొందరికి వెన్నునొప్పి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. చాలా మందికి గాయాలు అవ్వడం చూస్తున్నదే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా భుజం నొప్పితో బాధపడుతూనే..ఇటీవల `బింబిసార` ఈవెంట్ కు హాజరయ్యారని తెలిపారు. ప్రస్తుతం నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారని ఈ చిత్రం అక్టోబర్ నాటికి ప్రారంభం కానుందని సమాచారం.
తారక్ త్వరగా కోలుకుని మేకోవర్ తో షూట్ కి అటెండవ్వాల్సి ఉంటుంది. దానికోసం అతడు మళ్లీ కసరత్తులు చేయాలి. అక్టోబర్ వరకూ టైమ్ ఉంది కాబట్టి ఈలోగానే అతడు చాలా వరకూ మేకోవర్ ని సాధిస్తారని అభిమానులు భావిస్తున్నారు.