'సలార్' తర్వాత '#NTR31' ఉంటుందా? లేదా '#AA22' మూవీనా?

Update: 2021-03-11 03:30 GMT
'కేజీఎఫ్‌' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే 'కేజీఎఫ్ చాప్టర్ 2' చిత్రాన్ని కంప్లీట్ చేశాడు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ రేడియేషన్ ప్రాజెక్ట్ ఉంటుందని ఆ మధ్య క్లారిటీ కూడా వచ్చేసింది. అయితే సడెన్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి తారక్ ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేశాడు. ప్రస్తుతం సలార్ షూటింగ్ పనులతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఉన్నట్టుండి అల్లు అర్జున్ ని మీట్ అవడం అనేక చర్చలకు దారితీసింది.

ప్రశాంత్ నీల్ ఇటీవల బన్నీని గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కలిసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇద్దరూ చాలా సేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ - ప్రశాంత్ ప్రాజెక్ట్ పై సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న బన్నీ.. ఇకపై అన్నీ అదే స్థాయిలో ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో '#AA21' చిత్రాన్ని ప్రకటించాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఓ స్టోరీ లైన్ వినిపించినట్లు వార్తలు రావడంతో '#AA22' ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో 'NTR31' సినిమా ఎప్పుడు ఉంటుందో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్ 'ఆర్.ఆర్ ఆర్' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఇది కంప్లీట్ అయ్యేలోపు ప్రశాంత్ 'సలార్' సినిమా చేసేస్తాడు. అదే సమయంలో బన్నీ - కొరటాల మూవీ రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్ లలో ఎవరితో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News