లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక వైపు ప్రేమించిన ప్రియుడితో పెళ్లికి సిద్దం అయ్యింది. విఘ్నేష్ శివన్ మరియు నయన్ ల పెళ్లికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. అదుగో ఇదుగో.. అప్పుడు ఇప్పుడు.. ఇక్కడ అక్కడ అంటూ కొన్ని ఏళ్లుగా వస్తున్న పుకార్లకు ఒక క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. పెళ్లికి సిద్దం అయిన నయనతార ఇదే సమయంలో మరో లేడీ ఓరియంటెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.
ఈమద్య కాలంలో ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాల కంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తుంది. అందులో భాగంగానే ఓ2(ఆక్సీజన) అనే సినిమాను నయన్ చేసింది. థియేట్రికల్ రిలీజ్ చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకులమ ఉందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
జూన్ 17వ తారీకున డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే సినిమాకు ఎందుకు ఆ టైటిల్ పెట్టారో అర్థం అవుతుంది.
ఈ సినిమా లో నయనతార ఆరు ఏడు ఏళ్ల బాబుకు సింగిల్ మదర్ గా కనిపించబోతుంది. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ బాలుడిని కాపాడుకునేందుకు అమ్మగా నయనతార చేసే ప్రయత్నాల సమాహారమే ఈ సినిమా కథ.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే కొడుకును ఆసుపత్రికి తీసుకు వెళ్లడం కోసం బస్సులో ప్రయాణించాల్సి వస్తుంది. ఆ సమయంలో జరిగిన సంఘటన చుట్టు సినిమా కథ నడుస్తూ ఉంటుందట. హీరోయిన్ గా నయనతార ఎన్నో పాత్రల్లో నటించిన నయనతార కు అమ్మ పాత్ర కొత్తదేం కాదు. ఆమె గతంలో పలు సినిమాల్లో అమ్మ గా నటించి మెప్పించింది. కొడుకును కాపాడుకునే క్రమంలో అమ్మగా ఆమె చేసిన ప్రయత్నాలను అద్బుతంగా చూపించబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది.
తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు.. మలయాళం లో కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే 'ఓ2' సినిమా చాలా విభిన్నమైన సెంటిమెంట్ డ్రామాగా ఉండబోతుంది అనిపిస్తుంది. నయన్ పెళ్లి తర్వాత విడుదల అవ్వబోతున్న మొదటి సినిమా అవ్వడంతో దీని ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Full View