ఒక వైపు కరోనా కారణంగా సినిమా పరిశ్రమ మొత్తం స్థంభించి పోయింది. షూటింగ్స్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వరుసగా సినీ ప్రముఖులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన సినీ ప్రముఖులు కొందరు ఇటీవల మృతి చెందడం జరిగింది. ఆ విషాదాల నుండి కోలుకోకుండానే ప్రముఖ నటుడు బిజయ్ మొహంతి అనారోగ్యంతో మృతి చెందారు.
ఒడియాకు చెందిన సీనియర్ నటుడు బిజయ్ మొహంతి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఈయన గత కొన్నాళ్లుగా వృద్యాప్యం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. 70 ఏళ్ల వయసులో బిజయ్ మొహంతి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మృతి చెందారు.
బిజయ్ మొహంతి మృతి పట్ల ఒడిశా సీఎం నవీన్ పట్నాయర్ మరియు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సినీ రంగానికి ఆయన సేవకు గాను ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది అంటూ సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సీఎం మరియు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రార్థిస్తున్నామంటూ సోషల్ మీడియా ద్వారా శ్రద్దాంజలి ఘటించారు.