రాంగోపాల్ వర్మ దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. వరుస డిజాస్టర్లు ఇచ్చి.. తన ఉనికిని గుర్తింపును కూడా పోగొట్టుకుంటున్న వర్మ.. ఆఫీసర్ అంటూ అక్కినేని నాగార్జునతో శివకు పది రెట్ల స్థాయి ఉన్న సినిమా ఇస్తానని చెప్పాడు. ఇప్పటికే ముూవీ షూటింగ్ కంప్లీట్ చేసేసి.. ఈ నెల 25న విడుదల చేస్తానని చెప్పుకొచ్చాడు.
అయితే.. మొదటగా ఓ టీజర్ ఇచ్చినా సరే ఈ సినిమాకు బజ్ రాలేదు. బిజినెస్ కూడా జరగలేదు. అంతలోనే శ్రీరెడ్డి వ్యవహారంలో తలదూర్చి.. ఆఫీసర్ మూవీకి మరింత చేటు చేసిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మరో టీజర్ ను రిలీజ్ చేశాడు. ఈ సారి కూడా తన మేకింగ్ స్టైల్ ను చూపడమే జరిగింది. బాంబులతో కార్లు ఎగిరిపోవడాలు.. పరిగెడుతున్న వ్యక్తులకు కెమేరాలు కట్టి పనితనం చూపించడం లాంటి పాత ఫార్ములాలే ఉన్నాయి. అయితే.. పాలిటిక్స్- మాఫియాల్లో బటకు కనిపించేవన్నీ నిజాలు కావు లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి కానీ.. ఇవేమీ మూవీని తప్పకుండా చూసేయాలనిపించేంతగా ఆకట్టుకోలేదు.
ఈ నెల 12 ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు టీజర్ లోనే చెప్పిన వర్మ.. 'ఆఫీసర్ ను ఎలాంటి కాపీ చేయలేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను. నాగార్జున పోలీస్ గా నటించడం.. ఆ రోల్ కు ఓ కూతురు ఉండడం మినహాయిస్తే.. మరే విధమైన పోలిక లేదు' అని చెప్పాడు వర్మ. మరి ఈ టీజర్ తర్వాత అయినా బిజినెస్ పూర్తవుతుందో లేదో చూడాలి. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో నాగార్జున పార్టిసిపేషన్ లేకపోవడం మరోతరహా చర్చలకు తావిస్తోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View