ఆఫీసర్ మూవీ అనుకున్న తేదీ కంటే ఓ రోజు ఆలస్యంగా అయినా సరే థియేటర్లలోకి వచ్చింది. బయ్యర్లు లేకపోవడంతో.. పంపిణీ పద్ధతిలో ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఓవరాల్ గా 400 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయగలిగారు. నాగార్జున హీరో అయినా సరే.. వర్మ మూవీపై ఎలాంటి అంచనాలు లేవు.
అందుకు తగ్గట్లుగానే తొలి రోజు కలెక్షన్స్ ఉన్నాయి. తొలి రోజున నైజాం 9 లక్షలు.. సీడెడ్ 7 లక్షలు.. ఉత్తరాంధ్ర 6.5 లక్షలు.. గుంటూరు 4 లక్షలు.. ఈస్ట్ 4 లక్షలు.. వెస్ట్ 4 లక్షలు.. కృష్ణా 8 లక్షలు.. నెల్లూరు 2.5 లక్షలు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తొలి రోజు వచ్చిన మొత్తం కేవలం 45 లక్షలు మాత్రమే ఓపెనింగ్స్ అన్నమాట. ఏ రకంగా చూసినా.. నాగార్జున కెరీర్ లో అత్యంత దారుణమైన ఓపెనింగ్ ఇది. ఆయన ఇమేజ్ ను దెబ్బతగిలే ఫిగర్ ఇది. పైగా శివ తర్వాత తనకు ఎంతగానో నచ్చిన క్యారెక్టర్ అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.
ఈ సినిమా జనాలను ఆకట్టుకోకపోతే తనను తన్నమన్నాడని వర్మ అన్నాడంటూ నాగ్ చెబితే.. సినిమా బాగోకపోతే నాగార్జునను కూడా తన్నమంటూ రిలీజ్ ముందు బీరాలు పలికాడు వర్మ. కానీ సినిమా ఫలితం ఏంటో ముందుగానే తెలిసిపోయిన ఆఫీసర్.. అంచనాలకు తగినట్లుగానే పెర్ఫామ్ చేస్తోంది. ఈ టాక్ తో పుంజుకోవడం కూడా కష్టమే. మరి ఇప్పుడు ఎవరు ఎవరిని తన్నాలి వర్మా?