మళ్లీ శివ మ్యాజిక్ రిపీట్ చేస్తాడనే నమ్మకంతో.. రాంగోపాల్ వర్మ విపరీతమైన బ్యాడ్ ఫేజ్ లో ఉన్నా సరే.. నాగార్జున మరో ఛాన్స్ ఇచ్చి చేసిన మూవీ ఆఫీసర్. ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు మరీ నాసిరకంగా ఉండగా.. ఆఫీసర్ షూటింగ్ టైంలో వర్మ చేసిన ఇతరత్రా వ్యవహారాలు.. పరిస్థితిని మరీ దారుణం చేశాయి. సినిమానే దారుణంగా ఉండడంతో పాటు.. వర్మ చేసిన హంగామా ప్రభావం ఆఫీసర్ రిజల్ట్ పై ప్రత్యక్షంగానే కనిపించింది.
విడుదల అయిన రెండు వారాలకే ఆఫీసర్ కథ అన్ని ప్రాంతాల్లో ముగిసిపోయింది. నిజానికి అనేక ప్రాంతాల్లో తొలి వీకెండ్ కే సినిమా తీసేశారు. రెండో రోజుకే ఆఫీసర్ డెఫిసిట్ లో రన్ కావడమే ఇందుకు కారణంగా ట్రేడ్ జనాలు చెబుతున్నారు. నైజాం 11 లక్షలు.. సీడెండ్ 17 లక్షలు.. ఉత్తరాంధ్ర 14 లక్షలు.. గుంటూరు 8 లక్షలు.. ఈస్ట్ 4 లక్షలు.. వెస్ట్ లక్షలు.. కృష్ణా 13 లక్షలు.. నెల్లూరు 4 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల షేర్ కలెక్షన్ మాత్రమే రాగా.. ఇతర ప్రాంతాలతో కలుపుకుంటే ఇది 1 కోటి మార్కు మాత్రమే అందుకుంది.
బ్రేక్ఈవెన్ కాదు కదా.. ఒక్క ఏరియాలో కూడా ఖర్చుల మేరకు కూడా రాబట్టలేకపోయిందంటే ఆఫీసర్ పరిస్థితి అర్ధం అవుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ఘోరమైన డిజాస్టర్ గా ఆఫీసర్ నిలిచిపోనుంది. నాగ్ కెరీర్ కే మాయని మచ్చగా మిగిలిపోతోంది వర్మ తీసిన ఈ చిత్రం.