సమంత కెరీర్ లో నిలిచి పోయే సినిమా అంటే 'ఓబేబీ'. సమంత విభిన్నమైన పాత్రలో నటించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా ను గురు ఫిల్మ్స్ బ్యానర్ లో సునీత తాటి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ వారి భాగస్వామ్యంలో సునీత ఓ బేబీ నిర్మించిన విషయం తెల్సిందే. ఇప్పుడు గురు ఫిల్మ్స్ బ్యానర్ లో ఇంటర్నేషనల్ మూవీ రూపొందబోతుంది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమా కు ఫిలిప్ ఆర్ జాన్ దర్శకత్వం వహించబోతున్నాడు.
పలువురు ప్రముఖ నటీ నటులు ఇంటర్నేషనల్ గుర్తింపు ఉన్న టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేయబోతున్నారు. భారీ ఎత్తున ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా మూల కథను ప్రముఖ ఇండియన్ నవల నుండి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తిమెరి మురళి రాసిన ఆ నవల ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సినిమా గా మల్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
విభిన్న చిత్రాలు తీయాలనే ఉద్దేశ్యంతో సునీత తాటి ఈ సినిమాను ఎంపిక చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా అవార్డ్ విన్నింగ్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం చకచక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను నిర్వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులకు సంబంధించిన జాబిత ఇప్పటికే రెడీ అయ్యింది. తాజాగా ముఖ్య నటీనటుల తో ఒక ఫొటోను విడుదల చేసి సినిమాను ప్రకటించారు. మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడిస్తారేమో చూడాలి.