పెళ్లయ్యాక టిపికల్ రోల్స్ తో పాటు పెర్ఫార్మన్స్ బేస్డ్ పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటున్న సమంతా కొత్త మూవీ ఓ బేబీ ట్రైలర్ వచ్చేసింది. కథలో కీలకమైన పాయింట్ ఇందులో రివీల్ చేశారు. 70 ఏళ్ళ వయసున్న బామ్మ(లక్ష్మి)ఓ సాయంత్రం పూట ఊహించని విధంగా ఏదో అద్భుతం జరిగి 24 ఏళ్ళ పడుచుపిల్ల(సమంతా)లా మారిపోతుంది.ఈ విషయాన్ని ఆవిడ స్నేహితుడు(రాజేంద్ర ప్రసాద్) చెప్పినా బేబీ స్వంత కొడుకు(రావు రమేష్) నమ్మడు.
పడుచుపిల్లలా మారిపోయి బయటికి వచ్చిన బేబీని ఓ యువకుడు(నాగ శౌర్య)ఇష్టపడతాడు. ఆఖరికి బేబీ మనవడు(తేజ) కూడా ప్రపోజ్ చేసే దాకా వస్తుంది పరిస్థితి. పైకి శరీరం ఎలా మారినా లోపల మాత్రం 70 ఏళ్ళ ఫీలింగ్స్ తనలోనే ఉన్న బేబీ సమాజంలో తనకు ఎదురైన సవాళ్లు సమస్యలు చిక్కుముళ్లు ఎలా దాటుకుని వచ్చిందో స్క్రీన్ మీద చూడాల్సిందే
ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది పూర్తిగా సమంతా సింగల్ హ్యాండెడ్ షో. పాత్రలు చాలా ఉన్నప్పటికీ తనను బేస్ చేసుకుని అల్లిన కథ కావడంతో చెలరేగిపోయింది. నాగ శౌర్య డీసెంట్ గా ఉన్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో అడవి శేష్ ని సమంతకు పెళ్ళైన కొన్నాళ్లకె చనిపోయిన మిలిటరీ ఆఫీసర్ గా చూపించేశారు. రాజేంద్ర ప్రసాద్-రావు రమేష్ ల సీనియారిటీ మరో ప్లస్ గా నిలుస్తోంది
లక్ష్మి భూపాల సంభాషణల్లో కామెడీ టైమింగ్ బాగుంది. మిక్కీ జె మేయర్ సంగీతం రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం రిచ్ గా థీమ్ కు తగ్గట్టు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. సురేష్ తో సహా నాలుగు నిర్మాణ సంస్థలు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కి లోటు లేకుండా సాగిపోయింది. మొత్తానికి అవుట్ అండ్ అవుట్ ఫామిలీ ఎంటర్ టైనర్ అనే అంచనాకు తగ్గట్టు ఓ బేబీ ట్రైలర్ ఫస్ట్ ఎగ్జామ్ లో బాగానే పాస్ అయిపోయింది
Full View