మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ బాక్సాఫీస్ వద్ద అట్టర్ప్లాపైన సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల బయ్యర్లు, పంపిణీదారులు రోడ్డున పడాల్సొచ్చింది. అయితే లేటెస్టుగా మణిరత్నం దర్శకత్వం వహించిన 'ఒకే బంగారం' (ఓ కదల్ కన్మణి) రిలీజ్‌కి వస్తోంది. ఏప్రిల్ 17 రిలీజ్ తేదీని ప్రకటించారు. దుల్కార్ సల్మాన్ - నిత్యామీనన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్‌స్టోరి హిట్ కొట్టడం ఖాయం అని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. మణి సర్ ఈజ్ బ్యాక్ ఎగైన్ అని వినపడుతోంది.
సరిగ్గా ఈ టైమ్‌లో తమిళనాట ఓ అలజడి మొదలైంది. కడల్ చిత్రం వల్ల భారీగా నష్టపోయాం. ఆ నష్టాన్ని కొంతవరకూ అయిన మణిరత్నం భరించాలి. ఇప్పటికీ తెచ్చిన అప్పునకు వడ్డీలు చెల్లిస్తున్నాం. అందుకే కొంతవరకూ దానికి పరిహారం చెల్లించిన తర్వాతే ఒకే బంగారం రిలీజ్ చేయాలి అంటూ కొందరు పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే అక్కడ నిర్మాతల మండలిలో ఈ విషయంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. కడల్ కష్టాన్ని, నష్టాన్ని పూడ్చడానికే బంగారం వస్తోందా? ఏమో?!