ఓకే బంగారం.. టాలీవుడ్ లో మంచి హిట్ సాధించిన మూవీ. ఓకే కణ్మణి చిత్రాన్ని తెలుగులోకి అనువదించగా.. రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. వరుస పరాజయాల తర్వాత మణిరత్నంను మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చిన మూవీ ఇది.
అయితే.. గతంలో మణిరత్నం తీసిన మూవీస్ స్థాయిలో లేకపోయినా.. ఓకే బంగారంలో దుల్కర్ సల్మాన్-నిత్యా మీనన్ ల జంట.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. మణిరత్నం నుంచి ఆకట్టుకునే సినిమా కావడంతో పాటు.. ప్రస్తుత జనరేషన్ కు తగ్గట్లుగా ఉన్న ఈ చిత్రం బాగానే ఆడింది. దీన్నే హిందీలో ఓకే జాను పేరుతో రీమేక్ చేశారు. ఆదిత్య రాయ్ కపూర్-శ్రద్ధాకపూర్ లు నటించిన ఈ చిత్రం.. గత వారం రిలీజ్ అయింది. వారం రోజుల్లో ఈ మూవీ సాధించిన కలెక్షన్స్ కేవలం 20 కోట్లు మాత్రమే అంటే.. మూవీని ఆడియన్స్ ఏ రేంజ్ లో తిరస్కరించారో అర్ధమవుతుంది.
మెట్రో జోనర్ ను టచ్ చేసి నడిపించిన ఈ చిత్రం.. ఆ పాయింట్ ను లోతుగా చూపించడంలో ఫెయిల్ అయ్యారు. సౌత్ వెర్షన్స్ లో కూడా ఈ లోటు ఉన్నా.. మణిరత్నం మ్యాజిక్ తో ఆ లోపం కొట్టుకుపోయింది. కానీ హిందీ వెర్షన్ కి దర్శకుడు మారడం.. ఉన్న కాసిన్ని సీన్స్ ను కూడా యూత్ ని అట్రాక్ట్ చేయలేకపోవడంతో.. బాలీవుడ్ లో 'ఓకే జాను' ప్రేక్షకులతో నాట్ ఓకే అనిపించుకోవాల్సి వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/