చిత్రం: ‘ఒక మనసు’
నటీనటులు: నాగశౌర్య - నిహారిక - రావు రమేష్ - ప్రగతి - అవసరాల శ్రీనివాస్ - నాగినీడు - రాజా రవీంద్ర తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి
రచన - దర్శకత్వం: రామరాజు
‘మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామరాజు. కానీ రకరకాల కారణాల వల్ల ఆ సినిమా గురించి జనాలకు తెలియలేదు. ఐతే ఈసారి మెగా ఫ్యామిలీ అమ్మాయి నిహారికను.. టాలెంటెడ్ యంగ్ హీరో నాగశౌర్యను ప్రధాన పాత్రలకు ఎంచుకోవడంతో ‘ఒక మనసు’ మీద జనాలకు బాగానే ఆసక్తి కలిగింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్న భావన కలిగించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ ప్రేమకథలో విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సూర్య (నాగశౌర్య) ఎమ్మెల్యే అవ్వాలన్న తన తండ్రి కలను నెరవేర్చడమే ధ్యేయంగా బతుకుతున్న కుర్రాడు. అతడి జీవితంలోకి అనుకోకుండా ఎంబీబీఎస్ చదివే సంధ్య (నిహారిక) ప్రవేశిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ సూర్య ఎప్పుడూ ఎవరితోనో ఒకరితో గొడవ పడటం.. రాజకీయాల్లోకి వెళ్లడం సంధ్యకు ఇష్టముండదు. అయినా అతణ్ని వదులుకోలేకపోతుంది. ఇంతలో ఓ గొడవ వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బెయిలుపై బయటికి వచ్చినప్పటికీ ఆ కేసు వల్ల అతడి భవిష్యత్తే ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ సంధ్య అతడితోనే ఉండాలని కోరుకుంటుంది. ఐతే కొన్ని అనూహ్య పరిణామాల వల్ల సంధ్య.. సూర్యకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో సంధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుందన్నది తెర మీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
‘ఒక మనసు’ చూస్తుంటే కవిత్వం చదువతున్న భావన కలుగుతుంది. కాకపోతే కవిత్వాన్ని ఆస్వాదించే అభిరుచి ఎంతమందికి ఉంటుందన్నది ఇక్కడ కీలకమైన విషయం. చాలా నెమ్మదిగా సాగే ఈ భావోద్వేగ.. కవితాత్మక ప్రేమకథను చూడ్డానికి.. ఆస్వాదించడానికి చాలా ఓపిక ఉండాలి. అభిరుచి ఉన్న వాళ్లు ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు. అనుభూతి చెందవచ్చు. కొంతకాలం పాటు ఈ సినిమాను గుండెల్లో దాచుకోవచ్చు. కానీ సగటు ప్రేక్షకుడు మాత్రం ఈ భారమైన ప్రేమకథతో రెండున్నర గంటల పాటు ప్రయాణం చేయడం కష్టం.
నేపథ్యాలు వేరు.. ఆలోచనలు వేరు.. అభిరుచులూ వేరు.. కానీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ పరిస్థితులు వాళ్లిద్దరినీ ఒక్కటిగా నడవనివ్వవు. ఈ పరిస్థితుల్లో వాళ్లిద్దరి మధ్య సాగే భావోద్వేగాల సంఘర్షణే ‘ఒక మనసు’ చిత్రం. మన చుట్టూ ఉండే మనుషులు.. పరిస్థితులు మాత్రమే కనిపిస్తాయి తెరమీద. పాత్రల మధ్య సంభాషణలు కూడా అత్యంత సహజంగా సాగిపోతాయి. ఎక్కడా సినిమాటిక్ మెలోడ్రామా ఉండదు. ఆ విషయంలో దర్శకుడు రామరాజు ఏమాత్రం రాజీ పడలేదు. ఐతే సినిమా అన్నాక ప్రేక్షకుడు కాస్తంత మెలోడ్రామా.. వినోదం ఆశించడం సహజం. సహజత్వం పేరుతో.. మరీ మామూలుగా కథనాన్ని నడిపించేడయడంతో సమయం గడవడానికి కష్టమైపోతుంది.
ప్రేమలో పడ్డవాళ్లు.. సంఘర్షణ ఎదుర్కొన్నవాళ్లు.. ప్రధాన పాత్రధారుల్లో తమను తాము చూసుకోవచ్చు. ఆ పాత్రలతో పాటు ప్రయాణం చేయవచ్చు. ఇద్దరి మధ్య సంభాషణను ఫీల్ కావచ్చు. భావయుక్తమైన సన్నివేశాలు, ఎంతో నిగూఢార్థం ఉన్న మాటల్ని ఆస్వాదించే అభిరుచి ఉన్నవాళ్లు కూడా ‘ఒక మనసు’తో కనెక్టవ్వచ్చు. కానీ ‘ఒక మనసు’ను మనసుతో చూడగలిగే ప్రేక్షకులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. సగటు ప్రేక్షకుడికి మాత్రం చాలా చోట్ల ఏంటీ సోది అన్న భావనే కలుగుతుంది.
అసలే కథనం నత్తనకడకన సాగుతుంటే.. పాత్రధారుల మధ్య సన్నివేశాలు తగ్గిపోయి.. మాటలు మాత్రమే వినిపిస్తుండటంతో కథనం ముందుకు సాగడం మరీ కష్టమైపోతుంది. రైటర్ కం డైరెక్టర్ రామరాజు సినిమా అంతటా చాలా మంచి మాటలే రాశాడు. కానీ మాటల డోస్ మరీ ఎక్కువైపోయింది. ఒక దశ దాటాక సన్నివేశాలు తగ్గిపోయి.. డైలాగులు మాత్రమే వినిపిస్తుంటాయి. కథగా చెప్పుకోవడానికి ‘ఒక మనసు’లో పెద్దగా ఏమీ లేదు. చాలా చిన్న లైన్ అది. ప్రథమార్ధంలో అయితే కథ అసలేమీ ముందుకు సాగదు. చాలా వరకు సన్నివేశాలు రిపిటీటివ్ గా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో కథ కొన్ని మలుపులు తిరుగుతుంది. చివరి అరగంటలో పాత్రల మధ్య సంఘర్షణను దర్శకుడు బాగా చూపించాడు. పతాక సన్నివేశం గుండెల్ని తాకుతుంది. ఐతే చివరిదాకా కూర్చోవడానికి మాత్రం చాలా ఓపిక ఉండాలి.
మనకు తెలిసిన మలుపులే ఉన్న ప్రేమకథను సహజంగా.. సిన్సియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నటీనటులు కూడా అతడి ఆలోచనలకు తగ్గట్లుగా భావోద్వేగాల్ని పండించారు. సాంకేతిక విభాగాలు కూడా ఈ కథకు బలంగా నిలిచాయి. కానీ డెడ్ స్లో నరేషన్ సినిమాను చాలామంది ప్రేక్షకులకు దూరం చేసేస్తుంది. ‘ఒక మనసు’తో కనెక్టవ్వగలమా లేదా అన్నది ఆరంభంలోనే తెలిసిపోతుంది. అలా కాగలిగితే.. చివరి వరకు కథనంతో పాటు నెమ్మదిగా అడుగులేస్తూ సాగుతాం. లేదంటే ఈ సినిమా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టడం ఖాయం. ఇక్కడ అభిరుచి ఏంటన్నది ముఖ్యం. మెజారిటీ ఆడియన్స్ కు ‘ఒక మనసు’ భారంగానే అనిపించవచ్చు.
నటీనటులు:
నాగశౌర్య ఇప్పటిదాకా చేసిన పాత్రల్లో ‘ఒక మనసు’లోని సూర్య పాత్ర ది బెస్ట్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇలాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరీలో చేయడానికి ఎంతో ప్రతిభ ఉండాలి.. మెచ్యూరిటీ ఉండాలి. శౌర్య ఆ రెండూ చూపించాడు. సినిమాలో శౌర్య బాగా చేయలేదు అనదగ్గ సన్నివేశాలేమీ లేవు. కోరుకున్న అమ్మాయికి.. ప్రతికూలంగా మారిన పరిస్థితులకు మధ్య నలిగిపోయే పాత్రలో శౌర్య చాలా బాగా నటించాడు. ముఖ్యంగా చివరి అరగంటలో అతడి నటన కట్టిపడేస్తుంది. నిహారిక నటన పర్వాలేదు. తొలి సినిమా అయినా బాగానే చేసింది. కొన్నిచోట్ల నిహారిక బాగానే చేస్తున్నట్లు అనిపించినా.. కొన్ని చోట్ల క్లూలెస్ గా కనిపించింది. సంధ్య పాత్రకు ఇంకా మెచ్యూరిటీ.. అనుభవం ఉన్న అమ్మాయి అయితే బాగుండేదనిపిస్తుంది. నాగశౌర్యను నిహారిక మ్యాచ్ చేయలేకపోయింది. రావురమేష్ మరోసారి గొప్పగా నటించాడు. హీరో తండ్రి పాత్రకు ఆయన ప్రాణం పోశాడు. ప్రగతి కూడా చాలా బాగా చేసింది. అవసరాల శ్రీనివాస్ - రాజా రవీంద్ర - నాగినీడు సహజంగా నటించారు.
సాంకేతిక వర్గం:
టెక్నీషియన్స్ అందరూ ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని పండించడానికి తమవంతు సహకారం అందించారు. ఇలాంటి సినిమాలకు సంగీతం.. ఛాయాగ్రహణం ఎంతో కీలకం. ఆ రెండు విభాగాలూ సినిమాకు బలంగా నిలిచాయి. సునీల్ కశ్యప్ తన పాటలతో.. నేపథ్య సంగీతంతో సినిమా ఆద్యంతం తనదైన ముద్ర వేశాడు. సంగీతంతో ఒక ఫీల్ తీసుకురావడంలో అతను విజయవంతమయ్యాడు. సాహిత్యం కూడా చాలా బాగా కుదిరింది. రామ్ రెడ్డి కెమెరా పనితనం కూడా సినిమాకు ఒక ఫీల్ తీసుకొచ్చింది. ప్రధాన పాత్రధారుల భావోద్వేగాల్ని అతడి కెమెరా చక్కగా ఒడిసిపట్టింది. సముద్ర అందాల్ని కూడా చాలా బాగా చూపించాడు. మధుర శ్రీధర్ నిర్మాతగా తన అభిరుచిని మరోసారి చాటుకున్నాడు. వేగానికి.. సెన్సేషనలిజానికి పెట్టింది పేరైన టీవీ-9 ఇలాంటి నెమ్మదిగా సాగే ఫీల్ ఉన్న ప్రేమకథను నిర్మించడానికి ముందుకు రావడం విశేషమే. ఇక రచయిత-దర్శకుడు రామరాజు.. రెండో ప్రయత్నంలోనూ తన శైలిలో తాను సినిమా తీశాడంతే. ఈ తరం ప్రేక్షకుల అభిరుచిని కూడా అతను దృష్టిలోపెట్టుకోవాల్సింది. ‘‘పరిస్థితుల్ని బట్టి మారిపోయేది నిజమైన ప్రేమ కాదు. అలాగే పరిస్థితుల్ని అర్థం చేసుకోలేనిది కూడా నిజమైన ప్రేమ కాదు’’ లాంటి అర్థవంతమైన డైలాగులతో ఆద్యంతం రచయితగా తనదైన ముద్ర వేశాడు రామరాజు. భావోద్వేగాలతో నిండిన ఓ ప్రేమకథను పొయెటిగ్గా చెప్పడంలో అతడి సిన్సియారిటీ కనిపిస్తుంది. కానీ ఈ కథను జనరంజకంగా చెప్పడంలో.. ఎక్కువ మందికి చేరువ చేయడంలో మాత్రం అతను విజయవంతం కాలేకపోయాడు.
చివరగా: ఒక మనసు.. ‘భారమైన’ భావోద్వేగ ప్రేమకథ.
రేటింగ్: 2.5/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre