తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు ప్రసారం అయిన నాలుగు సీజన్ లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక సీజన్ 5 కూడా ఖచ్చితంగా రికార్డు స్థాయి రేటింగ్ ను దక్కించుకుంటుందని భావిస్తున్నారు. ప్రతి సీజన్ లో కూడా కొత్తదనం కోసం క్రియేటివ్ టీమ్ ప్లాన్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సీజన్ కు కూడా మరో సరికొత్త వ్యూహంను క్రియేటివ్ టీమ్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సీజన్ లో పలువురు పాత కంటెస్టెంట్స్ గత సీజన్ తో పాటు అంతకు ముందు సీజన్ ల వారు కనిపించబోతున్నారు.
వారి ఆధ్వర్యంలో టాస్క్ లు జరగడం లేదంటే.. వారితో కలిసి ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్స్ ఏదైనా చిన్న పాటి గేమ్స్ ఆడటం వంటివి జరుగుతుందట. సీజన్ ప్రారంభంలో పాత సీజన్ ల కంటెస్టెంట్స్ చేయబోతున్న సందడితో కర్టన్ రైజర్ కార్యక్రమం అదిరి పోబోతుంది అంటూ షో నిర్వాహకులు మరియు స్టార్ మా వర్గాల వారు చెబుతున్నారు. ఈ సీజన్ మొత్తంలో కూడా పాత కంటెస్టెంట్స్ రావడం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.
ఇక సీజన్ లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ కు సంబంధించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మరియు కోవిడ్ టెస్ట్ ల నిర్థారణ పూర్తి అయ్యింది. వారు నేడు లేదా రేపు అన్నట్లుగా క్వారెంటైన్ కు వెళ్లబోతున్నారు. రెండు వారాలకు అటు ఇటుగా వారు క్వారెంటైన్ లో ఉంటారు. గత సీజన్ లో కూడా క్వారెంటైన్ లో ఉంచి ఆ తర్వాత సీజన్ ను ప్రారంభించారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ అంతా కూడా హడావుడిగా ఉన్నారు. హోటల్ గదుల్లో క్వారెంటైన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకున్నా ఖచ్చితంగా జాగ్రత్తలు గత సీజన్ లో మాదిరిగా తీసుకుంటున్నారు. నాగార్జున హోస్ట్ గా ఖరారు అయ్యాడు. ఇక కొందరు కంటెస్టెంట్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అసలు సంగతి ఏంటీ అనేది సీజన్ ప్రారంభం అయిన రోజున క్లారిటీ వస్తుంది.