విలక్షణ నటుడు ఓంపురి మరణం ఆయన అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. కొన్ని రోజుల ముందు కూడా సల్మాన్ ఖాన్ సినిమా ‘ట్యూబ్ లైట్’ షూటింగ్ లో పాల్గొన్న ఆయన ఇంత హఠాత్తుగా చనిపోతారని ఎవరూ అనుకోలేదు. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో ఓంపురి మరణంపై చర్చలేమీ జరగలేదు. ఐతే ఓంపురి మిత్రుడు చెబుతున్న మాటలు వింటుంటే ఓంపురి మరణానికి సంబంధించి కొత్త కోణం కనిపిస్తోంది. ఓంపురి చనిపోవడానికి ముందు రోజు ఆయనకు.. మాజీ భార్య నందితకు పెద్ద గొడవే జరిగినట్లు ఆయన ఫ్రెండు కిద్వాయ్ చెబుతుండటం గమనార్హం.
కొన్నేళ్ల కిందట ఓంపురి తన భార్య నందిత నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తన సంసార జీవితం గురించి పుస్తకం ద్వారా బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడని.. ఓంపురి నుంచి విడిపోయింది నందిత. ఆ తర్వాత ఆయన్ని కలవడానికి ఆమె ఇష్టపడేది కాదు. ఐతే తల్లి దగ్గర పెరుగుతున్న తన కొడుకు ఇషాన్ ను చూడటానికి తరచుగా వెళ్లేవాడు ఓంపురి. ఓంపురి చనిపోవడానికి ముందు రోజు కూడా ఇషాన్ కోసం వెళ్లాడట. ఐతే నందిత.. ఇషాన్ కలిసి ఓ పార్టీకి వెళ్లినట్లు ఓంపురికి తెలిసింది. దీంతో నందితకు ఫోన్ చేసి కొడుకు త్వరగా తీసుకురావాలని అడిగాడట. ఈ విషయమై ఇద్దరికీ ఫోన్లో కాసేపు వాగ్వాదం జరిగిందట. దాదాపు గంటసేపు ఎదురు చూసినా వాళ్లు రాకపోవడంతో ఓంపురి.. తాను కార్లో కూర్చుని కొద్దిసేపు మద్యం సేవించి అక్కడి నుంచి వెళ్లిపోయామని.. ఆ సమయంలో ఓంపురి కొంచెం ఆవేదనగా కనిపించాడని కిద్వాయ్ తెలిపాడు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదని.. తెల్లవారేసరికి మిత్రుడి మరణవార్త వినాల్సి వచ్చిందని కిద్వాయ్ తెలిపాడు. మరి ఆ గొడవ వల్లే ఓంపురి ప్రాణాలు కోల్పోయాడా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/