మరొకసారి తల్లి కాబోతున్నసీనియర్ హీరోయిన్

Update: 2019-10-04 04:59 GMT
తెలుగు - తమిళ భాషల్లో ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయింది హీరోయిన్ స్నేహ. సౌందర్య తర్వాత ఎక్సపోజింగ్ జోలికి వెళ్లకుండా చక్కని చీరకట్టుతో తెలుగు - తమిళ ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకుంది స్నేహ.  కెరీర్లో మంచి పొజిషన్ లో ఉండగానే 2012 లో తన సహ నటుడు ప్రసన్న ని పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు సినిమా పరిశ్రమకి దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు.

మళ్ళీ కొన్నాళ్ల క్రితం స్నేహ తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది. ఇప్పుడు స్నేహ రెండవ సారి తల్లి కాబోతుంది. ఇటీవలే ఆమె శ్రీమంతం వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. దీనికి కుటుంబ సభ్యులు - బంధు మిత్రులు హాజరయ్యారు. ఇప్పుడు స్నేహ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఫోటోలు చుసిన అభిమానులు అందరూ తమ అభిమాన నటికి శుభాకాంక్షలు చెప్తున్నారు.
Tags:    

Similar News